ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

పలువురిని పార్టీ పదవులనుండి తొలగించిన దినకరన్

Posted 4 months ago politics

శశికళను ప్రక్కకు నెట్టి, పార్టీ లోని రెండు గ్రూప్ లు ఒకటై పదవులు పంచుకున్న 24 గంటల లోగా పళనిస్వామి ప్రభుత్వంపై 19 మంది ఎమ్యెల్యే ల చేత గవర్నర్ కు అవిశ్వాసం వ్యక్తం చేయిందిన శశికళ మేనల్లుడు దినకరన్ ఇప్పుడు పార్టీపై పట్టు పెంచుకొనే ప్రయత్నాలు ప్రారంభించాడు. అనూహ్యంగా పలువురు నేతలను  పార్టీ పదవుల నుండి తొలగించి, తన మద్దతు దారులను నియమించాడు. 

రెవెన్యూ మంత్రి ఆర్ బి ఉదయ్కుమార్ ను జయలలిత పేరుతో ఏర్పాటైన పార్టీ వేదిక కార్యదర్శిగా తొలగించే ఎమ్యెల్యే యస్ మరియప్పన్ కెన్నెడీ ను నియమించారు. అట్లాగే పార్టీ మధురై అర్బన్ కార్యదర్శి గా ఉన్న ఎమ్యెల్యే వివి రాజన్ చెన్నప్పను, రవాణా మంత్రి యం ఆర్ విజయభాస్కర్ ని కారును పార్టీ కార్యదర్శిగా తమ పదవుల నుండి తొలగించారు. 

ఇలా ఉండగా, పుదుచ్చేరి లో తన మద్దతుదారులైన ఎమ్యెల్యే లను ఉంచిన హోటల్ ముందు అన్నాడియంకె కార్యకర్తలు నిరసన ప్రదర్శన జరిపి దినకరన్ బొమ్మలను దగ్ధం చేశారు. కాగా, పళనిస్వామికి మద్దతు ఉపసంహరించుకున్న 19 మంది ఎమ్మెల్యేలు  కేఏ సెంగోట్టియన్‌ను సీఎం చేయాలని ప్రతిపాదించారు. సెంగోట్టియన్‌ను సీఎం చేసి అన్నాడీఎంకే పార్టీని కాపాడాలని గవర్నర్‌కు సూచించారు.  

సీఎంను మార్చేందుకు తాము అంగీకరిస్తే  అన్నాడీఎంకే ప్రభుత్వానికి మద్దతిస్తామని దినకరన్ వర్గం నేతలు తనతో మాట్లాడారని పన్నీరు సెల్వం వర్గానికి చెందిన ఒక నేత తెలిపారు. చెప్పారు. కానీ ఆ పని జరగదని తేల్చిచెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక శశికళ సోదరుడు వీకే దివకరన్ మాత్రం స్పీకర్ పీ ధన్‌పాల్‌ను సీఎం చేయాలని సూచించారు.

Related Articles

Most Read