//single page style gallary page

పళనిస్వామిపై `అవిశ్వాసం' బాంబు పేల్చిన దినకరన్

Posted 10 months ago | Category : politics

పళనిస్వామి, పన్నీరుసెల్వం ఆలింగనం చేసుకొని 24 గంటలు కూడా కాకముందే తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తాను తలచుకొంటే ప్రభుత్వం కూలిపోతుంది అంటూవస్తున్న శశికళ మేనల్లుడు దినకరన్ మద్దతు దారులు ముఖ్యమంత్రి  పళనిస్వామికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. 

రాష్ర్ట గవర్నర్ విద్యాసాగర్ రావును రాజ్ భవన్ లో వారి  వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు కలిసి సీఎం పళనికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు వినతిపత్రం అందజేశారు. తమిళనాడు శాసనసభలో సీఎం పళనికి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేదని తర్వాత వారు మీడియాకు తెలిపారు. 

పళనిపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని గవర్నర్ కు వినతి చేశామని తెలిపారు. దానితో ఖంగారు పడిన పళనిస్వామి వర్గంకు చెందిన  ఎంపీ మైత్రేయన్  కొద్దిసేపటికే గవర్నర్ ను కలిసి పళనిస్వామికి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. 

కాగా, మరో ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా పళనిస్వామికి మద్దతు ఉపసంహరించుకుంటారని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ చెప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణపై తనకు సమాచారం ఉందన్నారు స్టాలిన్. మొత్తంగా ఈ సంఖ్య 22కు చేరుతుందన్నారు. సీఎం పళనిస్వామిపై అవిశ్వాస తీర్మానికి తాము కూడా డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 234. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 134 మంది. వీరిలో 19 మంది ఎమ్మెల్యేలు శశికళ వర్గానికి చెందిన వారున్నారు. ఈ 19 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతు ఉపసంహరించుకోవడంతో  115 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే సీఎంకు ఉంటుంది. 

సీఎం పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పళనికి మద్దతు ఇవ్వాలి. లేకపోతే పళని ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 6 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 12 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 17 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 18 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 24 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 3 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 4 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 8 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

బీజేపీతో భేటీపై ట్విస్ట్..... టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్

Posted 10 hours ago | Category : politics

బీజేపీతో భేటీపై ట్విస్ట్..... టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్