ఆ దేశంలో యూనివర్సిటీ డిగ్రీలుంటే ఉద్యోగం కష్టమే !

Posted 6 months ago | Category : world

ఉన్నత చదువులు చదువుకున్న కొలది మంచి ఉద్యోగాలు, భారీగా జీతాలు వస్తాయని భావిస్తూ ఉంటాము. కానీ వియత్నాంలో మాత్రం యూనివర్సిటీ డిగ్రీలు ఉంటె మంచి ఉద్యోగాలు పొందడం కష్టం అంటున్నారు. ఇక మంచి సంపాదన కూడా చెప్పనవసరం లేదు. ఆ దేశంలో నిరుద్యోగం కూడా 2.3 శాతం మాత్రమే. కానీ యూనివర్సిటీ డిగ్రీలు ఉన్న వారిలో 17 శాతం మంది నిరుద్యోగులే. 

న్గుయెన్ వన్ డ్యూక్ ఆ దేశంలో ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ లో డిగ్రీ చేసాడు. రెండేళ్ల తరువాత ఇప్పుడు చూస్తే మోటార్ బైక్ టాక్సీ నడుపుతూ నెలకు 250 డాలర్ల వరకు సంపాదిస్తున్నాడు. ముగ్గురు పిల్లలు ఉంటె తల్లితండ్రులు కేవలం ఇతనిని మాత్రమే యూనివర్సిటీ కి పంపగలిగారు. మంచి ఉద్యోగం రాకపోవడమతొ ఆ కుటుంబం నిరాశకు గురయింది. 

డిగ్రీ లో మొదటి రెండేళ్లు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను కాకుండా ఆ దేశ అధినేత హోం చి మిన్హ జీవిత చరిత్రను, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను బోధించటం సరిపోతుందని, దానితో ఇతర నైపుణ్యాలు నేర్చుకొనే అవకాశం ఉండటం లేదని అతను వాపోయాడు. 

పాఠశాలలో అయితే తక్కువ జీతాలు పొందగల నైపుణ్యం పొందే శిక్షణ ఇస్తున్నారు. దానితో వారికి వెంటనే ఉద్యోగాలు వస్తున్నాయి. క్లిష్టమైన నైపుణ్యం గల పనులకు యువతను సిద్ధం చేయడంలో కాలేజీలు, యూనివర్సిటీ లు విఫలం అవుతూ ఉండడంతో వారి భవిష్యత్ అగమ్య గోచరంగా మిగిలింది. 

ప్రాధమిక వస్తు తయారీ రంగంలో అంతగా జీవన వ్యయం కానీ దేశాలలో జీతాలు గణనీయంగా పెరుగుతూ ఉంటె, వీరు ఆ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. వీటియం తలసరి ఆదాయాన్ని రెండు రేట్లకు, అంటే 4,000 డాలర్లకు పెంచాలనే ప్రపంచ బ్యాంక్  లక్ష్యానికి దానితో వియత్నాం చేరుకోలేక పోతున్నది. 

ఉన్నత విద్యపై విశేషంగా అవగాహన చేసిన కారణంగా సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాలు ఆర్ధికంగా విశేషంగా ప్రగతి సాధిస్తూ ఉండటం గమనార్హం. అందుకు విరుద్ధంగా అర్జంటేనియ, బ్రెజిల్, మెక్సికో వంటి దేశాలు ఉన్నత విద్యపై తగు పెట్టుబడి పెట్టక పోవడంతో ఆర్ధిక ప్రగతి వేగం తగ్గుతున్నది. వియత్నాం లో ఇప్పుడు చాలామంది యువత తమదేశంలోని యూనివర్సిటీ లలో కన్నా విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. 


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!