ప్రైమరీ సెంటర్లల్లోనే డయాలసిస్‌ సెంటర్లు పెట్టిస్తాం

Posted 9 months ago | Category : state politics

ఉద్ధానం కిడ్నీబాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం  నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  విమర్శించారు.  ఏ పేదవాడూ అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు.  

శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు పర్యటన సందర్భంగా జగతి గ్రామంలో కిడ్నీ బాధితులతో మాట్లాడుతూ తలకు మించిన భారాన్ని మోస్తున్న ఉద్దానం బాధితులు ఇంకొక్క ఏడాదిన్నర ఓపిక పట్టాలని, వచ్చేది ప్రజాప్రభుత్వమేనని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. 

ఆరోగ్యశ్రీ.. వైఎస్సార్‌ కలల పథకం. వచ్చే ప్రభుత్వంలో ఆ పథకాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని అంటూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోనే .డయాలసిస్‌ సెంటర్లు పెట్టిస్తాని హామీ ఇచ్చారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పేదలకు సంజీవిని లాంటి 108 వాహనాలు మూలన పడ్డాయని, 108కి ఫోన్‌ చేస్తే డీజిల్‌ లేదనే సమాధానం వస్తోందని, 104 వాహనాల పరిస్థితీ అంతే తయారైందని అన్నారు. 

గతంలో కిడ్నీ పేషెంట్లకుగానీ, మూగ, చెవిటి పిల్లలకుగానీ ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేసేవారని, కానీ  చంద్రబాబు సర్కారు ఇప్పుడు వాటిని ఎత్తేసిందని ధ్వజమెత్తారు. ఈ వ్యాధికిగురయ్యేవారిలో అధికులు పేదలే అని, వాళ్లందరిదీ వైద్యం చేయించుకోలేని పరిస్థితే అని అతనూ లాంటి వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 

ఉద్దానం ప్రాంతంలో అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయనేదానిని పరిశోధించడానికి రీసెర్చ్‌ సెంటర్‌ పెట్టాల్సి ఉండగా, ప్రభుత్వం గడచినా ముడేళ్ళల్లో ఆ దిశగా చర్యలు కూడా తీసుకోలేదని జగన్ విచారం వ్యక్తం చేశారు. . 


చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

Posted 35 minutes ago | Category : state

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

Posted 6 hours ago | Category : state

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్....! Video

Posted 8 hours ago | Category : state

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి  వెడ్డింగ్ రిసెప్షన్....! Video

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

Posted 9 hours ago | Category : state

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 10 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

Posted 10 hours ago | Category : state

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

Posted 11 hours ago | Category : state

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!

Posted 11 hours ago | Category : state

 కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!