ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేసిన ధన్సిక!

Posted 23 days ago movies

ప్రముఖ నిర్మాత, నటుడు శింబు తండ్రి టి. రాజేందర్‌ తనను దూషించడంతో చాలా బాధపడ్డానని ‘కబాలి’ ఫేం ధన్సిక అన్నారు. దాదాపు రెండు నెలల ముందు రాజేందర్‌.. ధన్సికను ఓ మీడియా సమావేశంలో అందరి ముందు అవమానించి మాట్లాడారు. తొలుత వేదికపై మాట్లాడిన ధన్సిక అందరికీ ధన్యవాదాలు చెప్పి, తన పేరును ప్రస్తావించలేదని విమర్శించారు. మర్చిపోయానంటూ ఆమె క్షమాపణలు చెప్పినా సరే.. రాజేందర్‌ పట్టించుకోలేదు.

ఆయన్ను ఆపడానికి మిగిలిన చిత్ర బృందం కూడా ప్రయత్నించకపోవడం గమనార్హం. ఈ సంఘటనపై అప్పట్లో హీరో విశాల్‌ తీవ్రంగా స్పందించారు. చిత్ర పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న రాజేందర్‌ తన కుమార్తె వయసు ఉన్న నటిని క్షమించలేకపోయారని అన్నారు. అయితే ఈ సంఘటన గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ధన్సిక మాట్లాడారు.

‘నేను అందరి ముందు కన్నీరు పెట్టుకోవడానికి కారణమైన ఈ సంఘటన గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. టీఆర్‌ (టి. రాజేందర్‌) ఆధ్యాత్మిక వ్యక్తని అందరూ అంటుంటారు. కానీ ఆధ్యాత్మిక భావాలు ఉన్న ఏ వ్యక్తి అలా అరవడు. నాకు ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి, అందుకే నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. నాకు కోపం ఎక్కువ. కానీ ఆధ్యాత్మికత నా కోపాన్ని తగ్గించింది’.

‘టీఆర్‌ వల్ల నేను మానసికంగా చాలా బాధపడ్డా. ఆయన వల్ల నేను మానసికంగా కృంగిపోయాను .. చాలా రోజులు బయటకు రావడానికి కూడా చాలా భయపడ్డాను” అని ఆమె తన బాధను వెళ్లగక్కారు.దీని నుంచి బయటికి రావడానికి నాకు వారం రోజులు పట్టింది. అయినా సరే నిశ్శబ్దంగా ఉండిపోయా. ఎందుకంటే.. గతంలో నేను ఇలాంటి ఆరోపణలను చాలా ఎదుర్కొన్నా. నిజానికి వివిధ రంగాల్లోని చాలా మంది మహిళలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలా అని నేను పురుషులను తప్పుపట్టడం లేదు’ అని ఆమె చెప్పారు.

ధన్సిక మాటలు కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోను హాట్ టాపిక్ అయ్యాయి.

Most Read