ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

దత్తాత్రేయ అవుట్ ... మురళీధరరావు ఇన్ ?

Posted 3 months ago politics

తెలంగాణ నుండి బిజెపి కి గల ఏకైన ఎంపీ బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పి మురళీధరరావును కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకో వచ్చని వార్త కధనాలు వెలువడుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక లలో పార్టీ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఆయన గతంలో స్వదేశీ జాగరణ్ మంచి జాతీయ కో కన్వీనర్ గా దేశ వ్యాప్తంగా సంస్థాగత అంశాలు చూసేవారు.

అటు దత్తాత్రేయి, ఇటు పార్టీ శాసనసభ పక్ష నేత జి కిషన్ రెడ్డి లతో పాటు ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు లతో ఆయనకు మంచి సంబంధాలు లేవు. గతంలో సుదీర్ఘ కాలంలో ఎబివిపి లో పనిచేసి ఉండడంతో మాజీ ఎబివిపి నాయకులతో పార్టీకి సంబంధం లేకుండా ఎక్కువగా తిరుగుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో తన ఉనికి తెలుపుకొంటూ వస్తున్నారు.

కాగా, దత్తాత్రేయకు వలే మురళీధరరావుకు సహితం ఆర్ యస్ యస్ స్థానిక నాయకత్వంతో మంచి సంబంధాలు లేవు. వారిని కాదని మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే వివిధ హోదాలలో రెండు దశాబ్దాలకు పైగా ఢిల్లీ లో ఉంటున్న ఆయనకు ఆర్ యస్ యస్ జాతీయ నాయకత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధినేత అమిత్ షా లతో కలసి బిజెపిలో చాలాకాలంగా పనిచేస్తున్నారు.
అయితే కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి పదవి కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. 2014 ఎన్నికలు కాగానే కేంద్రములో కాబినెట్ మంత్రి హోదా గల పదవి కోసమై తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా ఫలించలేదు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

Related Articles

Most Read