ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

జగన్ మోడీని కలవడంతో ఖంగుతున్న సిపియం మధు

Posted 7 months ago state politics

ప్రతిపక్ష నేత వై యస్ జగన్మోహన్ రెడ్డి గత వారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కలసి దాదాపుగా బిజెపి కి మద్దతు తెలపడంతో ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి మిత్రపక్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ నాయకులు ఖంగారు పడటం సహజమే. అయితే ఈ కలయికతో సిపియం రాష్ట్ర కార్యదర్శి పి మధు ఖంగు తినడం విస్మయం కలిగిస్తుంది. 

రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి కి ఎట్లా మద్దతు తెలుపుతావంటూ  ఆగ్రహంగా ప్రకటనలు చేశారు. ఇంతకీ కారణం ఏమిటంటే 50వ దశకంలో భారత్ లో తొలి  కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని  ఆంధ్రలోనే ఏర్పాటు చేస్తున్నామనే ధీమాతో ఎన్నికలకు ముందే మంత్రివర్గాన్ని కూడా ప్రకటించిన విఫలమైన కమ్యూనిస్ట్ లు ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ లో ఒక స్థానం కూడా లేకపోవడంతో తమాయించుకోలేక పోతున్నారు. 

గత ఎన్నికల్లో జగన్ తో పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించక పోయినా 2019లో మాత్రం పొత్తుకు గట్టి బంధం ఏర్పరచుకున్నారు. సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి వరుసకు సోదరుడైన ప్రతిపక్ష యంపీ విజయసాయి రెడ్డి ద్వారా జగన్ తో పొత్తు కు మార్గం ఏర్పరచు కున్నారు. 

అయితే ఇంతలో జగన్ బిజెపి కి జై అనడంతో దిమ్మ తిరిగిన్నట్లయింది. మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ తో పొత్తుకు సిపియం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  ప్రయత్నం చేస్తూ ఉంటె అటువైపు మొఖం కూడా చూపని మధు ఇప్పుడు హడావుడిగా పవన్ కళ్యాణ్ వైపు చూడటం ప్రారంభించారు. ఎవ్వయిరైతే ఏమిటి అసెంబ్లీ లో నాలుగు సీట్లు వచ్చేటట్లు చేస్తే చాలు అన్నట్లున్నారు. 

Most Read