ప్రతి నెల రూ.4 ధర పెరగనున్న వంటగ్యాస్

Posted 7 months ago | Category : business

సబ్సీడీలను తొలగించేందుకు వంటగ్యాస్‌పై మరింత భారం మోపనుంది కేంద్రప్రభుత్వం. ఇక నుంచి నెలవారీగా వంటగ్యాస్‌ ధరను పెంచనుంది. సబ్సీడీ గ్యాస్‌ సిలిండర్‌పై ప్రతి నెలా రూ.4 పెంచాలని ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలను ఆదేశించినట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ లోక్‌సభలో తెలిపారు.

"14.2 కేజీల సబ్సీడీ వంటగ్యాస్‌ సిలిండర్‌పై నెలకు రూ.2 చొప్పున పెంచాలని ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం సంస్థకు గత ఏడాదే చెప్పాం. తాజాగా దాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇలా వచ్చే ఏడాది మార్చి నాటిని వంటగ్యాస్‌పై సబ్సీడీని తొలగించాలని భావిస్తున్నాం" అని ధర్మేంద్రప్రదాన్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం సబ్సీడీ కింద ఏడాదికి 12 గ్యాస్‌ సిలిండర్లు తీసుకోవచ్చు. ఆ తర్వాత 13వ సిలిండర్‌ నుంచి మార్కెట్‌ రేటుకే విక్రయిస్తున్నారు. కాగా గతేడాది జులై 1 నుంచి సబ్సీడీ సిలిండర్‌పై ప్రతి నెలా రూ.2 (వ్యాట్‌ కాకుండా) పెంచుతూ వస్తున్నాయి ఆయిల్‌ కంపెనీలు. అయితే ఈ ఏడాది జూన్‌ 1 నుంచి నెలనెలా రూ. 4 పెంచాలని కంపెనీలను ఆదేశించినట్లు ప్రదాన్‌ తెలిపారు.

వచ్చే ఏడాది మార్చి వరకు లేదా సబ్సీడీ పూర్తిగా తొలగిపోయేంతవరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఈ ధరల పెంపు కొనసాగుతోందని చెప్పారు. ప్రసుత్తం ఢిల్లీలో సబ్సీడీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 477.46గా ఉంది.


పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 7 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 8 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 8 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 9 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 11 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 11 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 15 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 15 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 16 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 16 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

సరికొత్త షార్ట్ థియేటర్..!

Posted 16 days ago | Category : business

సరికొత్త షార్ట్ థియేటర్..!