ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

తమ ఎమ్మెల్యేను కిడ్నాప్‌ చేశారని కాంగ్రెస్‌ రభస

Posted 4 months ago politics

త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికలను ప్రభావితం చేసే లక్ష్యం తోనే గుజరాత్‌ పోలీసులు తమ ఎమ్మెల్యేను కిడ్నాప్‌ చేశారని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ అంశంపై కాంగ్రెస్‌ సభ్యులు రాజ్యసభ లో ఛైర్మన్‌ ముందున్న వెల్‌లోకి చేరి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. రాజ్యసభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాషాయ పార్టీ తమ ఎమ్మెల్యేలను చోరీ చేస్తోందని కాంగ్రెస్‌ సభ్యులు ఆరోపించారు. 

ఈ సమయంలో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో సభాధ్యక్ష స్థానంలోవున్న డిప్యూటీ ఛైర్మన్‌ పిజె కురియన్‌ సభను నాలుగు సార్లు వాయిదా వేశారు. తొలుత ఈ అంశాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ మాట్లాడుతూ పార్టీకి రాజీనామా చేసిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో ఒకరిని బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు తమ అభ్యర్థిగా ప్రకటించిందని చెప్పారు. 

జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సమావేశానికి హాజరై వెళ్తున్న వ్యారా ఎమ్మెల్యే పునాభారు గమిట్‌ను జిల్లా ఎస్పీ కిడ్నాప్‌ చేశారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వదని, అందువల్ల పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరాలని ఆ పోలీసు అధికారి సూచించాడని ఆజాద్‌ వివరించారు. బీజేపీ టికెట్‌ పొందేందుకు పార్టీ అధ్యక్షుడితో భేటీని తాను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని దుయ్యబట్టారు. 

తమ ఎమ్మెల్యేతో మాట్లాడిన ఎస్పీ గతంలో బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో అరెస్టయిన వ్యక్తేనని ఆయన చెప్పారు. దుస్తులు మార్చుకు వస్తానంటూ తమ ఎమ్మెల్యే ఆయన బారి నుండి తప్పించుకున్నాడని ఆజాద్‌ వివరించారు. "మీరు ఓట్లకోసం ఎమ్మెల్యేలను చోరీ చేస్తున్నారు, అందుకు పోలీసులను ఉపయోగిస్తున్నారు. ఇది సిగ్గుచేటయిన విషయం" అని ఆయన మండిపడ్డారు. 

అంతకు ముందు ఈ అంశాన్ని పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ద్వారా లేవనెత్తిన కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేయటం కోసం పోలీసులను వినియోగించటం ద్వారా బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు. దీనిపై కేంద్ర మంత్రి పురుషోత్తమ్‌ రూపాల స్పందిస్తూ కాంగ్రెస్‌ అంతర్గత విభేదాలతోనే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారని, దానిపై ఇక్కడ ఫిర్యాదు చేస్తే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు.

 ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దని, కాంగ్రెస్‌ ఏదైనా ఫిర్యాదు చేయదల్చుకుంటే ఇసికి ఫిర్యాదు చేసుకోవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ సూచించారు.నేతలు తమ పార్టీ సభ్యులను ప్రలోభ పెడుతున్నారని కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా విమర్శించారు.

Related Articles

Most Read