//single page style gallary page

అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్‌

Posted 10 months ago | Category : politics

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం.విన్సెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 51 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై పోలీసులు ఇదివరకే వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి భర్త, కుమారుడు, బంధువులు, ఇరుగుపొరుగు వారి వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు.

ఈ కేసు విచారణ అధికారిగా నియమితురాలైన కొల్లం సిటీ పోలీస్ కమిషనర్ ఎస్.అజీతా బేగం మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన వివరాలను శాసనసభ స్పీకర్ పి.శ్రీరాం కృష్ణన్‌కు తెలిపి ఎమ్మెల్యేను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరినట్టు తెలిపారు.

అయితే ఎమ్మెల్యేను విచారించేందుకు తమ అనుమతి అవసరం లేదని అసెంబ్లీ నుంచి కబురు అందినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సమయంలోనే తమ అనుమతి అవసరం ఉంటుంది తప్ప మిగతా సమయాల్లో అవసరం లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఎమ్మెల్యే అరెస్ట్‌తో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.

ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడినట్టు బలమైన సాక్ష్యాలున్నట్టు తేలడంతో కాంగ్రెస్ మౌనం దాల్చింది. ఎమ్మెల్యే, బాధిత మహిళకు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ పోలీసుల చేతికి చిక్కింది. కాగా, ఎమ్మెల్యే అరెస్ట్‌పై కేపీసీసీ చీఫ్ ఎంఎం హాసన్ మాట్లాడుతూ అవసరమైతే రాజీనామా చేస్తానని విన్సెంట్ చెప్పినట్టు పేర్కొన్నారు.


మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

Posted 19 hours ago | Category : sports politics

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

టీడీపీలోకి కీల‌క నేత‌..!!

Posted 20 hours ago | Category : politics

 టీడీపీలోకి కీల‌క నేత‌..!!

రంగంలోకి కుమారస్వామి భార్య

Posted a day ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

Posted a day ago | Category : politics

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

Posted a day ago | Category : politics

 ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

Posted a day ago | Category : politics

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

Posted a day ago | Category : politics movies

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

Posted a day ago | Category : politics

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

Posted 2 days ago | Category : politics

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

Posted 2 days ago | Category : politics national

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

జగన్ పార్టీకి షాక్

Posted 2 days ago | Category : state politics

జగన్ పార్టీకి షాక్