ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

రాహుల్ పై దాడి పట్ల మండిపడ్డ కాంగ్రెస్... బీజేపీ మౌనం

Posted 4 months ago politics

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వరద బాధిత ప్రాంతాలలో పర్యటనకు వెళ్లిన సందర్భంగా శుక్రవారం గుజరాత్ లో ఆయనపై జరిగిన దాడిని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అయితే ఈ సంఘటన పట్ల బీజేపీకి జాతీయ  నాయకత్వం మౌనం వహించింది. కాగా ఈ దాడితో సంబంధం ఉన్నదని స్థానిక బిజెపి నాయకుడు జయేష్ దర్జీ ని పోలీస్ లు అరెస్ట్ చేశారు. 

కాంగ్రెస్ రహిత భారత్ (కాంగ్రెస్ ముక్త్ భారత్)కు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మాత్రం విజయవంతం కావని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రం ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. గుజరాత్‌లో రాహుల్ గాంధీ కాన్వాయ్‌పై జరిగిన దాడిని ట్విట్టర్‌లో చిదంబరం ప్రస్తావిస్తూ, "తిట్టిపోయడాలు, తప్పుడు ఆరోపణలు, నిరసనలను అణిచివేయడం, ఇప్పుడు హింసాకాండ. ఎన్నిచేసినా కాంగ్రెస్ రహిత భారత్‌ కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలవంతం కానేరవు‌" అని ఆయన అన్నారు. రాహుల్‌పై జరిగిన దాడిని బీజేపీ జాతీయ నాయకత్వం ఎందుకు ఖండించడం లేదని మరో ట్వీట్‌లో చిదంబరం ప్రశ్నించారు. 

కాగా, బీజేపీ కార్య‌క‌ర్త త‌న వైపుగా భారీ రాయి విసిరాడ‌ని, అది త‌న వ్య‌క్తిగత అంగ‌ర‌క్ష‌కుడికి త‌గిలింద‌ని రాహుల్ ఈ సంఘటన గురించి చెప్పారు. ప్ర‌ధాని మోదీ, బీజేపీ రాజ‌నీతి అదే అని, దాని మీద ఏం మాట్లాడ‌గ‌ల‌మ‌ని కాంగ్రెస్ నేత అన్నారు. 

 రాహుల్‌పై 'హత్యాయత్నం' జరిగిందని కాంగ్రెస్ మండిపడింది. ప్రత్యర్థి నేతలపై హింస, బెదరింపులు, భౌతిక దాడులకు దిగడం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు పరిపాటైందని, రాహుల్‌పై జరిగిన దాడికి కేంద్రం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. 

గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌తో పాటు ఛండీగఢ్, భోపాల్, ముంబై, ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాల వెలుపల నిరసనలకు దిగారు. గట్కోపర్‌లోని ముంబై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలోకి పువ్వులు విసిరి వినూత్న తరహాలో తమ నిరసన తెలిపారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Related Articles

Most Read