//single page style gallary page

ఖతార్‌ లో 7 లక్షల మంది భారతీయుల భద్రతపై ఆందోళన

Posted a year ago | Category : world

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణతో నాలుగు అరబ్ దేశాలు ఖతార్‌   తో దౌత్య సంబంధాలను తెంచు కోవడంతో ఆ దేశ రాజధాని దోహా నుండి ఆ ప్రాంతంలో ప్రయాణించడం కష్టం కానుంది. రాబోయే రోజులలో పశ్చిమ ఆసియా తీవ్ర సంక్షోభంలో చిక్కుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానితో  ఖతార్‌  లో నివసిస్తున్న సుమారు 7 లక్షల మంది భారతీయుల భద్రత ఆందోళనకరంగా మారింది. 

స్థానిక ప్రజల కన్నా రెట్టింపు సంఖ్యలో భారతీయులు అక్కడ ఉన్నారు. వారిలో సగం మంది కేరళకు చెందిన వారే. దానితో కేరళ ముఖ్యమంత్రి పి విజయన్ వారి రక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ వ్రాసారు. 

మనకు విదేశీ మారకద్రవ్యం  సమకూర్చడంలో అరబ్ దేశాలలోని భారతీయులే కీలక పాత్ర వహిస్తున్నారు. ఐరోపా, అమెరికా ల నుండి కన్నా ఈ దేశాల నుండే అత్యధికంగా తమ ఆదాయాలను కుటుంభం సభ్యుల కోసం పంపుతున్నారు. 2016 లో 63 బిలియన్ డాలర్లు పంపారు. అయితే వారి భద్రత తొలినుండి ఆందోళనకరంగానే ఉంది. 

అక్కడ ఉంటున్న భారతీయులలో అత్యధికులు కాంట్రాక్టు కార్మికులు. 2022 లో ఖతార్‌ లో జరుననున్న ప్రపంచ ఫుట్ బాల్ వరల్డ్ కప్ పోటీలకు అవసరమైన నిర్మాణపు పనులు చేస్తున్నారు. కొన్ని కంపెనీల ఉద్యోగుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నా, అమానుష పరిస్థితులు నెలకొన్నా మెరుగైన జీవనం కోసం భారీ సంఖ్యలో భారతీయులు అరబ్ దేశాలకు వలస వెడుతున్నారు. 

వలస కార్మికులతో పాటు రెండు దేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి. సాలీనా 18 బిలియన్ డాలర్ల వాణజ్యం జరుగుతున్నది. భారత్ కు అవసరమైన ఎల్ ఎన్ జి లో 65 శాతం ఆ దేశం నుండే వస్తున్నది. విప్రో, హెచ్ సి ఎల్ వంటి ప్రముఖ భారతీయ కంపెనీలు, యస్ బి ఐ, ఐసిఇసిఐ వంటి బ్యాంక్ లకు అక్కడ కార్యాలయాలు ఉన్నాయి. 

ఖతార్‌  లో ఈ సంవత్సరం ఇప్పటికే 112 మంది భారతీయులు అనుమానాస్పదంగా మృతి చెందారు. 194 మంది సెంట్రల్ జైలు లో ఉండగా, 88 మంది పంపివేసి వారి కేంద్రంలో ఉన్నారు. ఆ దేశం నుండి తిరిగి వచ్చేయడానికి భారత్ రాయబార కార్యాలయం గత నెల మే లోనే 42 మందికి అత్యవసర సర్టిఫికెట్ లను జారీ చేసింది. భారత్ నుండి ఐరోపా, అమెరికా వైపు వెళ్లే పలు విమానాలు సహితం ఇక్కడ ఆగుతూ ఉంటాయి. దానితో ఈ దేశంలో నెలకొన్న ఘర్షణ పరిస్థితులు మనకు ఆందోళనకరంగా మారుతున్నాయి. 


అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted a month ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted a month ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted a month ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted a month ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

Posted a month ago | Category : world

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

Posted 2 months ago | Category : world

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

Posted 2 months ago | Category : world

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

Posted 2 months ago | Category : world

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

Posted 2 months ago | Category : world

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

Posted 2 months ago | Category : world technology

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

Posted 3 months ago | Category : world

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం