ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

మోడీ పాలనపై పౌర సంస్థల అసంతృప్తి.. నినాదాలే ఆచరణ ఎక్కడ ?

Posted 7 months ago national politics

మూడేళ్ళ పాలనలో ఘన విజయం సాధించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా మూడు వారల పాటు ఉత్సవాలు జరుపుకొంటుండగా, సుమారు నాలుగు వేల పౌర సమాజ సంస్థలు కలసి వాడ నా థోడా అభియాన్ ఆధ్వర్యంలో  తయారు చేసిన 110-పేజీల `పౌరుల నివేదిక' లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నికల సమయంలో వలే నినాదాలు ఇవ్వడమే గాని అమలు జరగడం లేదని పేర్కొన్నారు. దేశంలో పేదలు, మధ్య తరగతి ప్రజలకు సంబంధించి ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని స్పష్టం చేశారు. 

2014 ఎన్నికల్లో "సబ్ కా సాత్ సబ్ కా వికాస్" నినాదంతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం మూడేళ్లు అయినా నినాదం మాటలకే పరిమితం అహఁయినదని, ఎన్నికల సమయంలో కోటి మందికి ఉద్యోగ అవకాశం కలిపిస్తామని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారని, అయితే ఉపాధి కల్పనలో యుపిఎ ప్రభుత్వం లో వలే దాదాపుగా `సున్నా' వృద్ధి రేటు ఉన్నదని తెలిపారు.

కాశ్మీర్ లో అశాంతి, ఆఫ్రికన్ విద్యార్ధులపై దాడులు, భోపాల్ ఎదురుకాల్పులు, గోరక్ష బృందాలచే విస్తృతమైన హింస వంటి పలు సంఘటనలు 2016లో జరిగాయని అంటూ మానవ హక్కులను ప్రభుత్వ,  ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు దారుణంగా అణచడం జరుగుతున్నదని ఆందోళన ప్రకటించారు. 

అవినీతి వ్యతిరేక సంస్థల ఏర్పాటుకు సంబంధించిన చట్టం తీసుకు రావడంలో ఈ ప్రభుత్వం జరుపుతున్న జాప్యం అవినీతి ముక్త భారత్ అని ఇచ్చిన వాగ్దానం పట్ల ఈ ప్రభుత్వ నమ్మదగిన చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం అని చెప్పారు. 

ఈ ప్రభుత్వ ఘోర వైఫల్యాలతో కాశ్మీర్ విషయంలో విధానపర స్థంభన ఒక్కటని అంటూ ఉద్యోగ విరమణ చేసిన నిఘా అధికారులకో లేదా ఆర్ యస్ యస్ కు చెందిన వారికో కాశ్మీర్ విధానాన్ని వదిలివేసి ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందని ఆరోపించింది. 

Related Articles

Most Read