సైనికుల సంఖ్యను సగానికి పైగా తగ్గించనున్న చైనా !

Posted 7 months ago | Category : world

ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక  శక్తి గల చైనా చరిత్రలో మొదటిసారిగా తన సైనికుల సంఖ్యను భారీగా, సగంకు పైగా తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 23 లక్షలుగా ఉన్న సైన్యాన్ని 10 లక్షల లోపుకు తీసుకువచ్చే పక్రియను చేపట్టింది. పున‌ర్నిర్మాణ ప్ర‌క్రియ‌లో భాగంగా మిలిట‌రీని త‌గ్గిస్తున్న‌ట్లు పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ(పీఎల్ఏ) అధికార ప‌త్రిక వెల్ల‌డించింది.

ఆర్మీ సంఖ్య‌ను త‌గ్గించి,  నేవీ, మిస్సైల్ బ‌ల‌గాల‌ను పెంచాల‌ని భావిస్తున్న‌ట్లు ఆ ప‌త్రిక తెలిపింది. చైనా వ్యూహాత్మ‌క ల‌క్ష్యాలు, ర‌క్ష‌ణ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఈ సంస్క‌ర‌ణ‌లు జ‌రుగుతున్నాయి. గ‌తంలో పీఎల్ఏ ఆర్మీపైనే ఎక్కువ‌గా దృష్టి సారించింది. ఇప్పుడు నేవీ, ఇత‌ర ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లను ప‌టిష్ఠం చేయ‌డానికి ఈ మార్పులు చేస్తున్న‌ది అని ఆ ప‌త్రిక చెప్పింది. 

 పీఎల్ఏ నేవీ, పీఎల్ఏ స్ట్రేట‌జిక్ స‌పోర్ట్ ఫోర్స్‌, పీఎల్ఏ రాకెట్ ఫోర్స్‌ల‌లో బ‌ల‌గాల సంఖ్య పెర‌గ‌నుండ‌గా. పీఎల్ఏ ఎయిర్‌ఫోర్స్‌లో మాత్రం ఇప్పుడున్న బ‌ల‌గాలే కొన‌సాగ‌నున్నాయి.  గ‌తంలో ఆర్మీని మూడు ల‌క్ష‌ల వ‌ర‌కు త‌గ్గిస్తున్న‌ట్లు చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ ప్ర‌క‌టించారు.

 2015నాటికి చైనా ఆర్మీ సంఖ్య 23 ల‌క్ష‌లని గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక తెలిపింది. ఈ ఆర్మీ సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల విదేశాల్లో మ‌రింత సమ‌ర్థంగా పీఎల్ఏ త‌మ మిష‌న్ల‌ను విజ‌య‌వంతం చేయ‌గ‌లుగుతుంద‌ని చైనా ఆర్మీ కంట్రోల్ అండ్ డిపార్టుమెంట్ అడ్వైజ‌ర్ జు గువాన్‌గ్యు అన్నారు. అటు ద‌క్షిణ చైనా స‌ముద్రం, ఇటు ఇండియాతో ఏర్ప‌డిన ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో చైనా ఆర్మీ సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్ట‌డం ప్రాధాన్యతను సంతరింప చేసుకొంటున్నది. 


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!