భారత్ పై యుద్ధం విషయంలో తోకముడిచింది చైనా !

Posted 6 months ago | Category : world

డోక్లాం నుంచి భారత దళాలను తిప్పికొట్టేందుకు స్వల్పకాలిక సైనిక చర్య చేపట్టాలంటూ నెల రోజులుగా చైనా అధికారిక మీడియాలో వస్తున్న కధనాల పట్ల మౌనంగా ఉంటూ వచ్చిన చైనా ప్రభుత్వం ఇప్పుడు ఆయా కథనాలకు తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. భారత మీడియా ప్రతినిధులతో  చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కర్నల్ రెన్ గ్వోకియాంగ్ మాట్లాడుతూ స్వల్పకాలిక సైనిక చర్య వంటి అభిప్రాయాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు విదేశాంగ శాఖ లేదా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు మాత్ర మే చేస్తారని స్పష్టం చేశారు.

 ఇటీవల చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ తమ దేశ సలహాదారుడు హు జియోంగ్‌ను ఉటంకిస్తూ రెండు వారాల్లో భారత సైన్యాలను డోక్లాం నుంచి వెళ్లగొట్టేందుకు స్వల్పకాలిక సైనిక చర్య జరుగుతుంది అని పేర్కొంది. దీనిపై ప్రశ్నించినప్పుడు రెన్ పై విధంగా స్పందించారు. డోక్లాంలోని పరిస్థితులను వివరించేందుకు కొంతమంది భారత జర్నలిస్టులను చైనా ప్రభుత్వం బీజింగ్‌కు ఆహ్వానించింది.

ఈ సందర్భంగా భారత్‌పై విషప్రచారానికి చైనా అడుగడుగునా ప్రయత్నించింది.ప్రజా విమోచన సైన్యం (పీఎల్‌ఏ) సీనియర్ కల్నల్ లీలీ, భారత సైనికులే తమ ప్రాదేశిక సరిహద్దుల్లోకి చొరబడి, భూభాగాన్ని ఆక్రమించారని చెప్పారు. ఎలాగైనా తమ భూభాగాన్ని కాపాడుకోవాలని మా సైన్యం తపిస్తున్నది. డోక్లాంలో యుద్ధాన్ని నివారించాలనుకుంటే భారత్ వెనుదిరగాల్సిందే అని కల్నల్ లీలీ చెప్పారు. "అధికారంలో ఉన్న చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ), ఆర్మీ అత్యున్నత విభాగమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ చెప్పినట్లుగానే మేం నడుచుకుంటాం" అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భారత జర్నలిస్టుల బృందం ఎదుట సైనిక పాటవాన్నీ, యుద్ధ నైపుణ్యాలను చైనా ప్రదర్శించింది. ఓ బుల్‌డోజర్‌తో సహా 48 భారత సైనిక బృందాలు ఇప్పటికీ డోక్లాంలోనే ఉన్నాయని చైనా ఆరోపించింది.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!