ఎవరెస్ట్‌ క్లీనింగ్ చేపట్టిన చైనా

Posted 9 months ago | Category : world

ప్రపంచంలోనే ఎత్తయిన పర్వత శిఖరం  ఎవరెస్ట్‌ను శుభ్రపరిచేందుకు చైనా ప్రభుత్వం మొదటి సారిగా ఇప్పుడు నడుం బిగించింది. 8,848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్‌పై పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు చైనా, టింగ్రీ కౌంటీ ప్రభుత్వంతో కలిసి తొమ్మిది రోజుల కార్యక్రమం చేపట్టింది. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ఎవరెస్ట్ శిఖరం ఉత్తరభాగం వైపు ఈ క్లీనింగ్  ప్రారంభించింది. 

ఎవరెస్ట్ శిఖరంపై 5,200 మీటర్ల నుంచి 6,500 మీటర్ల ఎత్తులో విహారయాత్రికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మొదటి 5 రోజులు ఆసియాలోని పామిర్స్, హిమాలయాలు, టిబెట్, మౌంట్ ఎవరెస్ట్ ప్రాంతాల పరిధిలో ఎవరెస్ట్ ఉత్తరభాగం నుంచి 4 టన్నుల చెత్తను సేకరించామని టిబెట్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ నైమా సెరింగ్ తెలిపారు. 

ప్రతీ ఏడాది ఎవరెస్ట్ ఉత్తరభాగానికి 60వేల మంది యాత్రికులు వస్తారు. ప్లాస్టిక్ బ్యాగులు, కిచెన్ సామాగ్రి, గుడారాలతోపాటు శిఖరంపై ఎక్కేటపుడు వాడే సామాగ్రిని పర్యాటకులు అక్కడే వదిలివెళ్తారు. క్లీనింగ్ క్యాంపెయిన్ లో వారు వదిలివెళ్లిన చెత్తను తొలగిస్తున్నామని తెలిపారు. చైనాతోపాటు విదేశీ వాలంటీర్లు, ఇతర అధికారుల బృందం క్లీనింగ్ క్యాంపెయిన్‌లో పాల్గొంది. 

రెండేళ్ల క్రితం భారతీయ సైనికులు నేపాల్ వైపు నుండి ఈ పర్వతాన్ని శుభ్రం చేశారు. ఇందులో 300 మందికి పైగా పర్వతోహకులు, స్థానికులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువగా చెత్త ఉండే ఎత్తైన పర్వతంగా పేరొందింది. రెండు నెలల క్రితం కూడా నేపాల్ ప్రభుత్వం, పర్వత పర్యటన నిర్వాకుల బృందం కలసి 21 వేల అడుగుల మేరకు పర్వతాన్ని శుభ్రం చేశారు. 


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!