మానస సరోవర యాత్రకు చైనా అడ్డు

Posted 7 months ago | Category : world

చైనా మరోమారు భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. భారతీయలు ఎంతో పవిత్రంగా భావించే మానస సరోవర యాత్రకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోంది. పైగా ఇదంగా యాత్రికుల రక్షణ కోసమే చేస్తున్నామని చెబుతూ వస్తున్నాసిక్కింలో భారత సైనికుల`దురాక్రమణ'కు నిరసనగా భారత యాత్రికులను అనుమతించడం లేదని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 

భారత సరిహద్దు భద్రత దళం `దురాక్రమణ' తో తమ నిర్మాణ కార్యకలాపాలను అడ్డుకున్నట్లు చైనా ఆరోపించగా, భారత వర్గాలు ఖండించాయి. చైనా సైనికులే భారత భూభాగం లోకి దురాక్రమణ జరిపి లాల్టెన్ పోస్ట్ కు సమీపంలో రెండు బంకర్ లను ధ్వంసం చేశారని తెలిపారు. అకారణంగా టిబెట్ లో భారత యాత్రికులను నిలిపి వేశారని విచారం వ్యక్తం చేశారు. 

గడచిన శుక్రవారం నుంచి యాత్రికులను చైనా అడ్డుకుంటూ వస్తోంది. వరదలు, కొండచరియలు విరిగిపడుతుండడంతో మార్గం సరిగా లేదని చెబుతూ యాత్రికులను అడ్డుకుంటోంది. ఇరు దేశాలు ఈ అంశంపై చర్చిస్తున్నాయని చైనా విదేశాంగ కార్యాలయ కార్యదర్శి గెంగ్ సుహంగ్ చెప్పారు. 

మొదటి బ్యాచ్‌లో 47 మంది యాత్రికులు జూన్ 19న నాథులా దగ్గర నుంచి సరిహద్దులు దాటవలసి వచ్చింది. అయితే వాతావరణం అనుకూలంగా లేని కారణంతో వారు బేస్ క్యాంప్ వద్దనే ఉండిపోవలసి వచ్చింది. తరువాత జూన్ 23న వారిని చైనా రోడ్డు మార్గం గుండా వెళ్లకుండా అడ్డుకుంది. భారత్ అధికారులు దీనిపై స్పందిస్తూ మానస సరోవర యాత్రకు చైనా ఉద్దేశపూర్వకంగానే ఆటంకాలు కల్పిస్తున్నదని ఆరోపించారు.

భద్రతా కారణాల వల్లన యాత్రికులను ముందుకు వెళ్ళడానికి అనుమతించడం లేదని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి  లుకంగ్ చెప్పారు. ఈ విషయంలో భారత్ స్పందన పట్లనే తదుపరి చర్యలు ఉండగలవని స్పష్టం చేశారు. సిక్కిం వద్ద రెండు దేశాల సైనికుల మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో ఇరు దేశాలు అదనపు దళాలను సరిహద్దుకు తరలించాయి.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!