అరుణాచల్ సరిహద్దు టిబెట్ లో చైనా లైవ్ ఫైర్ డ్రిల్

Posted 7 months ago | Category : world

ఓవైపు సిక్కిం స‌రిహ‌ద్దులో నెలరోజులుగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొనగా అరుణాచ‌ల్ స‌రిహ‌ద్దు స‌మీపంగా టిబెట్ లో చైనా  పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ (పీఎల్ఏ) రెండు రోజుల క్రితం భారీ సైనిక విన్యాసం  జరిపింది.  11 గంట‌ల పాటు ఈ లైవ్ ఫైర్ డ్రిల్ జ‌రిగిన‌ట్లు గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక వెల్ల‌డించింది. అయితే ఎప్పుడు జరిగింద‌న్న‌ది మాత్రం చెప్ప‌లేదు. 

పీఎల్ఏకు చెందిన టిబెట్ మిలిట‌రీ క‌మాండ్ ఈ డ్రిల్స్ నిర్వ‌హించిన‌ట్లు ఆ ప‌త్రిక తెలిపింది. ఈ డ్రిల్స్ ద్వారా భార‌త ప్ర‌భుత్వం, ఆర్మీకి గ‌ట్టి హెచ్చ‌రిక‌లు చైనీస్ ఆర్మీ పంపించింది. ఇప్ప‌టికీ అరుణాచ‌ల్‌లోని చాలా ప్రాంతాల‌ను త‌మ భూభాగాలుగా చైనా చెప్పుకుంటున్న‌ది. 

మనం  బ్ర‌హ్మ‌పుత్ర‌గా పిలిచే యార్లుంగ్ జాంగ్‌బో న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో ఈ డ్రిల్స్ జ‌రిగాయి. సంయుక్తంగా దాడులు చేసేందుకు వివిధ మిలిట‌రీ విభాగాలు ఒక్క‌చోటికి రావ‌డం, యాంటీ ట్యాంక్ గ్రెనేడ్స్‌, మిస్సైల్స్ ప‌రీక్ష‌లు డ్రిల్‌లో భాగంగా నిర్వ‌హించిన‌ట్లు గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక తెలిపింది. అంతేకాదు శ‌త్రువు ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌ను గుర్తించే రాడార్ యూనిట్లు, ఆ విమానాలను ధ్వంసం చేయగల సామర్ధంలను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. 

జూన్ 16న సిక్కిం సెక్టార్ లోని  డోక్లా ప్రాంతంలో చైనా చేపట్టిన రోడ్ నిర్మాణాన్ని భారత సైన్యం అడ్డుకోవడం తెలిసిందే. అప్పటి నుండి భారత సైనికులు అక్కడినుండి వెనుకకు వెళ్లాలని చైనా వత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రాంతాన్ని తనదిగా చైనా వాదిస్తున్నది. భారత్-చైనా ల మధ్య జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 3,448 కి మీ పొడవైన సరిహద్దు ఉండగా, అందులో 220 కి.మీ సిక్కిం ప్రాంతంలో ఉంది. 


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!