ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఎన్నికల్లోపు అమరావతి నిర్మాణాలు చూపాలని చంద్రబాబు ఆరాటం

Posted 7 months ago state politics

నవ్య ఆంధ్ర ప్రదేశ్ రాజధాని గా అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని ప్రజలలో రంగుల కలలు కలిగించడంలో విజయం సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంతవరకు నిర్మాణాలు ఒక్కడుగు కూడా ముందుకు వెళ్లకపోవడంతో ఆందోళనగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మూడేళ్లు గడుస్తున్నా కనీసం రాజధాని నగరంలో నిర్మించవలసిన ప్రతిష్టాకరమైన అసెంబ్లీ, సచివాలయం, రాజభవన్, హై కోర్ట్ వంటి కీలక భవనాలకు డిజైన్ కూడా ఖరారు కాలేదు. 

పలు కోర్ట్ వివాదాలు, ప్రతిపక్షాల నిరసనలు, అధికార వర్గాల అభ్యంతరాలను దాటుకొని రాజధాని అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి పనులను చేపట్టడం కోసం సింగపూర్ కన్సార్షియానికి ‘ఎంపిక ధ్రువీకరణ పత్రం’ (లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌) ను సోమవారం సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడాడుతూ వేగంగా మొదలు పెట్టాలని, వచ్చే ఎన్నికల నాటికి  (2019) పురోగతి కనిపించేటట్లు చేయాలని సింగపూర్‌ సంస్థల కన్సార్షియాను ముఖ్యమంత్రి అభ్యర్ధించారు. 

2019 ఎన్నికల లోపుగా కీలక భవనాల నిర్మాణం చూపలేని పక్షంలో ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నది. అందుకనే ఎన్నికల నాటికి కొన్ని భావనాలనైనా నిర్మాణం పూర్తి చేయడం పట్ల ఇప్పుడు ద్రుష్టి కేంద్రీకరిస్తున్నారు. 

ఏడాది కిందటే మొదలుకావాల్సిన రాజధాని ప్రాంత స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుకొంతమంది అడ్డంకులు సృష్టించడంతో ఆలస్యమైంది. న్యాయస్థానాలకు వెళ్లడం, పదే పదే ఆటంకాలు కల్పించడం, అవినీతి ఆరోపణలు చెయ్యడంతో విలువైన ఏడాది సమయాన్ని కోల్పోయామని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుకున్న విధంగా పనలు జరగడం లేదని ఆయన మాటలే వెల్లడి చేస్తున్నాయి. 

Most Read