ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

నోట్ల రద్దు తరహాలోనే మోడీ మరో సంచలనం !

Posted 25 days ago national

గత ఏడాది నోట్ల రద్దు తో దేశాన్ని ఒక్క సారి ఉలిక్కిపడేలా చేసిన మోడీ ఇప్పుడు కూడా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

వివరాలోకి వెళితే ఇప్పటి దాకా ఆఫీస్, వ్యక్తిగత అవసరాలకి ఆలవాలంగా ఉంటూ అనేక విధాల ఉపయోగపడుతున్న చెక్ బుక్‌లకు కూడ కనుమరుగయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నిజానికి నోట్ల రద్దు సమయానికే డిజిటల్ ట్రాన్సాక్షన్‌పై కేంద్ర ప్రభుత్వం కేంద్రీకరించింది. కానీ అప్పటికప్పుడు పూర్తి స్థాయిలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ లు అందుబాటులోకి రాలేదు. అందుకే ఇప్పుడు చెక్ బుక్ లకు చెక్ పెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే దేశంలో నగదు రహిత లావాదేవీలను పెంచడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో పాటు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ వ్యాలెట్‌లను ప్రజలు విరివిగా వినియోగిస్తున్నారు. దేశాన్ని మరింత డిజిటల్‌ బాట పట్టించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి బ్యాంకింగ్‌ అవసరానికి ఉపయోగించే చెక్‌ బుక్‌ సదుపాయానికి చెక్‌ చెప్పాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే ప్రజలకు డిజిటల్‌ ట్రాన్సాక్షాన్స్ తప్పనిసరి అవుతాయి.

ఇదే విషయాన్ని 'డిజిటల్‌ రథ్‌' కార్యక్రమంలో పాల్గొన్న భారత వ్యాపారుల సమాఖ్య సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ మీడియాకు వెల్లడించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కేంద్రం త్వరలో చెక్‌బుక్‌ సదుపాయాన్ని ఉపసంహరించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నోట్ల ముద్రణకు రూ.25వేల కోట్లు, అంతేకాదు వాటి భద్రత, రవాణా కోసం మరో రూ.6వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ సెస్ చార్జీలు కాక బ్యాంకులు డెబిట్‌ కార్డు లావాదేవీలపై 1 శాతం, క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై 2 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నాయని చెప్పారు.

డిజిటల్‌ లావాదేవీలు ప్రోత్సహించాలంటే నేరుగా బ్యాంకులకే రాయితీ మొత్తాన్ని కేంద్రం అందించి ఛార్జీలు రద్దు ఎత్తివేయాలని సూచించారు. దేశంలో 80 కోట్ల డెబిట్‌ కార్డులు ఉన్నాయి. అయితే 5 శాతం మాత్రమే నగదురహిత లావాదేవీల కోసం వినియోగిస్తున్నారని తెలిపారు. మిగిలిన 95 శాతం నగదు ఉపసంహరణకే వినియోగిస్తున్నారని చెప్పారు. ఎప్పుడైతే చార్జీలు తగ్గిస్తారో అప్పుడే నగదురహిత లావాదేవీలు పెరిగే అవకాసం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Related Articles

Most Read