ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

చంద్రబాబుపై పోలీస్ కేసు?.

Posted 6 months ago state politics

ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ రాష్ట్రంలో కేసు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే... ఇదేమీ ఓటుకు నోటు కేసులా పెద్దదేమీ కాదు,చిన్న కేసే. పూర్వ కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి పోలీసు స్టేషన్లలో ఈ కేసు నమోదుకు అక్కడి టీఆరెస్ నాయకులు పట్టుపడుతుండగా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం కేసు నమోదు చేయాల్సిన అసవరం ఉందా లేదా అన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికైతే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫిర్యాదు అందడంతో దాన్ని మాత్రం స్వీకరించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఏపీలో బ్లాక్ డేగా జరుపుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారంటూ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో కొందరు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముస్లిం పొలిటికల్ జేఏసీ - కేటీఆర్ యువసేన ఆధ్వర్యంలోని బృందం ఒకటి పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మను కలిసి ఈ మేరకు చంద్రబాబుపై ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమరవీరులను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో చంద్రబాబును తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. కాగా ఏసీపీ సింధూశర్మ దీనిపై న్యాయనిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు.

Most Read