ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమి కోసం పిలుపు

Posted 3 months ago politics

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎను ఓడించేందుకు జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు చేస్తామని ప్రతిపక్ష ప్రముఖులు  ప్రతిజ్ఞ చేశారు. అందుకోసం ప్రజా మద్దతును కూడగట్టేందుకు పాట్నాలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో 'బీజేపీ భగావో..దేశ్‌ బచావో' నినాదంతో భారీ ర్యాలీలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబి ఆజాద్, జెడియు అసమ్మతి నాయకుడు శరద్ యాదవ్, జార్ఖండ్‌ మాజీ సిఎం హేమంత్‌ సోరేన్‌ లతో సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. లాలూ ఇద్దరు కుమారులు, కుటుంబసభ్యులు కూడా వేదికపై ఉన్నారు.

ఇందిరా గాంధీ హయాంలో బలవంతపు కుటుంబ నియం త్రణ ఆపరేష న్లతో ప్రభుత్వం కుప్పకూలిందని అంటూ  ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో మోడీ ప్రభుత్వ పతనం మొదలైన్నట్లు మమత బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్రం రాష్ట్రాల పట్ల వివక్ష తను పాటిస్తోందని ఆమె ఆరోపించారు. బీజేపీ పాలిత ప్రాంతాలలో ఘర్ ణలు జరిగితే భారీ సంఖ్యలో హుటాహుటిన సైన్యాన్ని పంపిస్తా రని, అదే వేరే రాష్ట్రాలకు ఎన్నిసార్లు అడిగినా కిమ్మనరని ఆమె విమ ర్శించారు. ప్రతిపక్ష నేతలను బెదిరించడమే కేంద్రం రివాజుగా మారిందని, తమ పార్టీకి గొడుగు పట్ట కుంటే కేంద్ర సంస్థలు సిబిఐ, ఇడి లను వాడుకుంటున్నారని ఆమె మండిపడ్డారు.

శరద్‌యాదవ్‌ మొదటిసారిగా లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలుపుతూ  త్వరలోనే జాతీయస్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. నితీష్ కుమార్ తో ఇక కలసి ప్రసక్తి లేదని సంకేతం ఇస్తూ రెండు నెలలు ఆగితే తమదే అసలైన జెడియు అని రుజువు చేస్తామని కూడా సవాల్ చేశారు. బీజేపీ వ్యతిరేకంగా మహాకూటమికి ఓటు వేసిన బీహార్‌ ప్రజలు  ఇప్పుడు మోసపోయిన ఇకపై అలా జరగకుండా దేశంలో ప్రతి మూలకీ వెళ్లి మహాకూటమి గురించి ప్రచారం చేస్తానని  ప్రకటించారు.

అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన మోడీ, ఇప్పుడు 2022 వరకూ ఆగాలని కొత్త నినాదం ఎత్తుకోవడం తప్పించుకునేందుకు వేసిన ఎత్తు అని లాలూ ప్రసాద్ విమర్శించారు.

Related Articles

Most Read