అన్న ముకేశ్ దూకుడుతో అనిల్ నష్టం రూ.1,210 కోట్లు

Posted 6 months ago | Category : business

అనిల్ అంబానీకి చెందిన టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ నష్టాలను మూటగట్టుకున్నది. తన అన్న ముకేశ్ అంబానీకి చెందిన టెలికం వెంచర్ రిలయన్స్ జియో దెబ్బకు కంపెనీ విలవిలలాడింది. జూన్ 30తో ముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ.1,210 కోట్ల నష్టాన్ని చవిచూసింది. రుణభారంతో సతమతమవుతున్న సంస్థకు ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంటతో మరింత కుదేలైంది.

జియో ప్రకటించిన టారిఫ్‌ల దెబ్బకు గడిచిన మూడు త్రైమాసికాలుగా నష్టాలనే ప్రకటించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సంస్థ రూ.90 కోట్ల లాభాన్ని గడించింది. టెలికం రంగంలో నెలకొన్న పోటీ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఈ రంగంలో నిస్తేజం నెలకొననున్నదని ఆర్‌కామ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఆదాయం విషయానికి వస్తే ఏడాది ప్రాతిపదికన 33 శాతం క్షీణించి రూ.3,591 కోట్లకు పరిమితమైనట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఇది రూ.5,361 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఆర్‌కామ్ రూ.45 వేల కోట్ల స్థాయిలో అప్పు ఉంది.

గడిచిన 20 ఏళ్లలో తొలిసారిగా టెలికం రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయని, నిర్వహణ మార్జిన్లు తగ్గుముఖం పట్టడం, వడ్డీల కోసం అధికంగా నిధులు కేటాయించాల్సి రావడం, తరుగుదల అధికంగా ఉండటం, రుణ విమోచన చార్జీలు అధికమవడం, స్పెక్ట్రం కొనుగోలుకు అధిక స్థాయిలో నిధులు వెచ్చించడంతో ఈ రంగంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనుందని కంపెనీ పేర్కొంది.

ఆర్‌కామ్‌లో ఎయిర్‌సెల్ విలీనమవనుండటంతో కంపెనీ అప్పు రూ.14 వేల కోట్లు తగ్గనున్నది. రుణాలను తగ్గించుకోవడంలో భాగంగా సంస్ టవర్ల బిజినెస్ బూక్‌ఫిల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో వాటాను విక్రయించడం ద్వారా రూ.11 వేల కోట్లు రావచ్చునని అంచనావేస్తున్నది. గత వారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర 2.12 శాతం తగ్గి రూ.20.75 వద్ద ముగిసింది.


పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 7 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 8 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 8 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 9 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 11 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 11 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 15 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 15 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 16 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 16 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

సరికొత్త షార్ట్ థియేటర్..!

Posted 16 days ago | Category : business

సరికొత్త షార్ట్ థియేటర్..!