ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

పాక్ పై మరోసారి మెరుపుదాడి!

Posted a month ago world

ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి కాపాడుతున్న పాకిస్తాన్ పై మరోసారి'ఆపరేషన్ లాడెన్' తరహా దాడి జరపాలని అమెరికా సేనలు భావించాయి. అయితే ఆఖరు క్షణంలో పాక్ తగిన చర్య తీసుకోవడంతో అమెరికా ఈ దాడిని విరమించుకున్నట్లు సమాచారం.అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చేందుకు 2011లో పాకిస్తాన్ లో అమెరికా నేవీ సీల్ కమాండోలు దాడి చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ అమెరికా ఇలాంటి మెరుపుదాడి మళ్లీ జరిపితే అది పాకిస్తాన్ కు మరో మాయని మచ్చగా మిగిలిపోయేది.అసలేం జరిగిందంటే... అమెరికా దేశస్థురాలు కైత్లాన్ కోల్ మన్(31), కెనడా జాతీయుడైన ఆమె భర్త జాషువా బాయ్లే(34)ను పాకిస్తాన్ లోని హక్కానీ గ్రూప్ ఉగ్రవాదులు అపహరించి ఐదేళ్లపాటు నిర్బంధించారు.కైత్లాన్ కుటుంబాన్ని కాపాడాలంటూ అమెరికా ఎన్నోమార్లు కోరినా పాక్ కుంటిసాకులు చెబుతూ వచ్చింది. కొన్ని వారాల క్రితం హక్కానీ ఉగ్రవాదులు కైత్లాన్ కుటుంబాన్ని పాక్ లోనే మరో ప్రాంతానికి తరలిస్తుండగా అమెరికా నిఘా డ్రోన్ పసిగట్టింది.దీంతో అమెరికన్ సేనలు అప్రమత్తమయ్యాయి. పాక్ మాటలు అబద్ధాలని తేలిపోవడంతో లాడన్ ను మట్టుబెట్టడానికి జరిపిన మెరుపు దాడి తరహాలోనే మరోసారి నేవీ సీల్ కమాండోలతో ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించాయి.ఈ మెరుపుదాడి కోసం ఆరుగురు కమాండోలను సైతం ఎంపిక చేశారు. విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడా తెలియజేశారు. కానీ ఆఖరు క్షణంలో ఈ దాడిని విరమించుకున్నారు.నిఘా డ్రోన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని అందజేసి.. వెంటనే కైత్లాన్ కుటుంబాన్ని తక్షణమే విడిపించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని పాకిస్తాన్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడంతో పాక్ దిగివచ్చింది.

Most Read