ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

దినకరన్ రాకతో మారుతున్న స్వరాలు.. బిజెపి లో ఆందోళన

Posted 6 months ago national politics

రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే మద్దతు తమకే అంటూ ధీమాగా ఉన్న బిజెపి కి శశికళ మేనల్లుడు దినకరన్ జైలు నుండి బెయిల్ పై బయటకు రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మారుతున్న స్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జైలుకు వెళ్లేముందు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన ఆయన బైటకు రాగానే ఇక పార్టీ వ్యవహారాలు చూసుకొంటానని ప్రకటించడంతో అధికార పక్షంలో లుకలుకలు బయలు దేరాయి. 

ఆయనకు స్వాగతం పలకడం కోసం 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు యంపీలు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర మంత్రుల స్వరాల్లో సహితం మార్పు వస్తున్నది. శశికళకు కాంగ్రెస్ వారితో ఉన్న అనుబంధం తెలిసిందే. దినకరన్‌ పార్టీలో కొనసాగే విషయమై మంత్రులు ఆచితూచి మాట్లాడుతున్నారు. దీంతో మళ్లీ అన్నాడీఎంకేలో సమీకరణాలు మారవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చెన్నై తిరిగి వచ్చినప్పుడు పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. 

తాను ప్రేక్షక పాత్ర వహించబోనని స్పష్టం చేశారు. తాను పక్కకు తప్పుకొంటె పార్టీలోని రెండు వర్గాలు కలిసే అవకాశం ఉన్నదంటే ఒప్పుకున్నానని, కానీ 45 రోజులైనా అటువంటి సూచనలు కనిపించక పోవడంతో విలీనం ప్రశ్న ఉత్పన్నం కాబోదని దినకరన్ అన్నారు. అయితే ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఆయన మంత్రివర్గ సహచరులు ఆయనను కలసిన వారిలో లేరు. వచ్చేవారం జైల్లో ఉన్న శశికళను కలసి భవిష్యత్ కార్యాచరణను ఆయన నిర్ణయించుకొని అవకాశం ఉంది. 

రెండాకుల చిహ్నం కోసం ముడుపులు చెల్లించిన కేసులో బెయిలుపై విడుదలైన టీటీవీ దినకరన్‌  పార్టీ పనులు కొనసాగిస్తానని దిల్లీలో విలేకరులతో పేర్కొన్నారు. తనను పార్టీ నుంచి తొలగించే అధికారం ప్రధాన కార్యదర్శికి మాత్రమే ఉందని తెలిపారు. ఇలా ఉండగా, మాజీ మంత్రి తోప్పు వెంకటాచలం ఇప్పటికే తన వర్గం ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి కంగారు పుట్టిస్తున్నారు. 

అమ్మ వర్గానికి చెందిన మంత్రులు మెల్లగా అయన చుట్టూ చేరుతున్నారు. అన్నాడీఎంకే (అమ్మ)లో మళ్లీ భేదాభిప్రాయాలు బయటపడుతున్నాయి. దినకరన్‌ పార్టీ వ్యవహారాల్లో పాల్గొనే విషయంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిర్ణయిస్తారని రాష్ట్ర మంత్రి సెంగోట్టయన్‌ తిరుత్తణిలో పేర్కొన్నారు. కాగా దిండుకల్‌లో మంత్రి దిండుకల్‌ శ్రీనివాసన్‌ మాట్లాడుతూ తాజాగా  దినకరన్‌ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. పార్టీ వ్యవహారాల్లో పాల్గొనేందుకు ఆయనకు పూర్తి హక్కులు ఉన్నాయన్నారు. 

Related Articles

Most Read