ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఆర్ కృష్ణయ్య కు గాలం వేస్తున్న బిజెపి

Posted 7 months ago state politics

తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పార్టీని పటిష్ట పరచడం కోసం పార్ట్ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం మూడు రోజుల రాష్ట్ర పర్యటనకు వస్త్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆకట్టుకోవడానికి చేసిన  ప్రయత్నాలు ఫలించక పోవడంతో బిజెపి నాయకత్వం తాజాగా తెలుగు దేశం నాయకుల వైపు ద్రుష్టి మళ్ళించిన్నట్లు కనబడుతున్నది. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ శాసన సభ్యుడు, ప్రముఖ బిసి నాయకుడు ఆర్ కృష్ణయ్య కు గాలం వేయడం ప్రారంభించారు. 

బిసిల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా సుమారు నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని పోరాటాలు చేస్తున్న కృష్ణయ్య 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగు దేశం ప్రకటించడంతో ఆ పార్టీలో చేరి, ఎన్నికల్లో పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుండి తెలంగాణ లో టిడిపి బలహీన పడుతూ ఉండడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 

అమిత్ షా రాక సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు బిజెపి లో చేరేటట్లు చేయాలని పలువురు మాజీ మంత్రులపై రాష్ట్ర పార్టీ నాయకులు వల వేశారు.  అయితే వారెవ్వరి నుండి చెప్పుకోదలిగిన సుముఖత వ్యక్తం కాలేదు. కృష్ణయ్య వస్తే తెలంగాణ లో బిసిలను పెద్ద ఎత్తున ఆకర్షించవచ్చని ఇప్పుడు బిజెపి నాయకులు భావిస్తున్నల్టు తెలుస్తుంది. 

మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ బిజెపి నాయకురాలు డి పురందేశ్వరి కృష్ణయ్యను ఇంటికి పిలిపించి ఆదివారం నాడు గంటకు పైగా సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా తనను బిజెపి లో చేరమని ఆమె కోరారని కృష్ణయ్య తెలిపారు. అయితే తెలుగు దేశం పార్టీ ని విడిచే ప్రసక్తి లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

నరేంద్రమోడీ ప్రభుత్వం చేబడుతున్న బిసి అనుకూల విధానాలు, ముఖ్యంగా బిసి కమీషన్ కు చట్టబద్దత కలిపించడం పట్ల కృష్ణయ్య హర్షం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బిసిలకు చట్ట సభలలో రిజర్వేషన్ కలిపించాలని కోరుతూ అన్ని పార్టీల మద్దతు కూడదీసుకుని మోడీ ప్రభుత్వంపై వత్తిడి తేవాలని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. 

పార్టీ రాజకీయాల పట్ల కన్నా, బిసిల సంక్షేమం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు  కృష్ణయ్య స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయితే తెలంగాణ లో ప్రస్తుతం టి ఆర్ యస్, కాంగ్రెస్ పార్టీలు అగ్రకులాల నాయకత్వంలో ఉండడంతో, బిసి నాయకత్వం కేవలం బిజెపి లోనే సాధ్యం కాగలదని ఆయనను ఒప్పించే ప్రయత్నం బిజెపి నాయకులు చేస్తున్నట్లు కనబడుతున్నది. 

మరోవంక కేంద్రములో, ఏపీలో తమ భాగస్వామ్య పక్షంగా ఉండి తమ యం ఎల్ ఏ ను `పార్టీ మారమని' బిజెపి నాయకులు ప్రోత్సహించడం పట్ల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. ఈ విషయమై అమిత్ షా వద్ద ప్రస్తావించాలని పార్టీ సహచరులకు సూచించినట్లు సమాచారం. 

Most Read