బీజేపీలో చేరనున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

Posted 9 months ago | Category : national politics

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను రాజకీయాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీనియర్ నటుడు కృష్ణంరాజు ద్వారా ప్రభాస్ ను ముగ్గులోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు కమలం అధినాయకత్వం పావులు కదుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అధికారంపై కన్నేసిన కమలం నేతలు ఇందుకు కలిసొచ్చే ఏ అంశాన్ని వదలడం లేదు. ఇప్పటికే మూడు రోజుల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయించి పర్యటించారు. రాబోయే కాలంలో తెలంగాణలో అధికారం బీజేపీ దేనని ఢంకా భజాయించి మరీ చెప్పి వెళ్లారు అమిత్ షా.

గతంలో తమకు మంచి వనరుగా ఉపయోగపడిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బయట పడ్డారు. జనసేనను పూర్తిస్థాయిలో పటిష్టం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అందుకే ఈసారి పవన్ ను కాదని, తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ను ప్రచారానికి దించే ఆలోచన చేస్తోంది. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు గవర్నర్ పదవి ఇచ్చి సంతృప్తి పరిచే ప్రయత్నం సాగుతుందట. ఆ తర్వాత ప్రభాస్ తీసుకువస్తారట, తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని ప్రభాస్ చాలా సార్లు చెప్పాడు. అయినా మీరు ఉంటే చాలు, మిగతాదంతా మేము చూసుకుంటామని చెబుతున్నారట కమలం నేతలు.

బాహుబలి తొలి భాగం సక్సెస్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు కృష్ణంరాజు, ప్రభాస్ లు. ఇప్పుడు రెండో భాగం ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధించడంతో మరోసారి ప్రధానిని కలిసేందుకు రెబల్ స్టార్స్ సిద్దమయ్యారట. పనిలో పనిగా తమ సంగతి ఏంటని కృష్ణంరాజు గుర్తు చేస్తారనే ప్రచారం సాగుతోంది.అయినా ఇందుకు రెబల్ స్టార్ ఒప్పుకుంటారా లేదా అనే విషయంపై రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది. ఏదిఏమైనా తన పెదనాన్న కృష్ణంరాజు చెపితే ప్రభాస్ వింటాడని కమల నేతల గట్టి నమ్మకం. చూద్దాం పెద్దనాన్న చెప్పినట్లే వింటాడో లేదో మన రెబల్ యంగ్ స్టార్.


జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted an hour ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 4 hours ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 12 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 17 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!