ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఫలితం ఇవ్వని సోనియా తో బీజేపీ బృందం భేటీ

Posted 6 months ago politics

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన సంప్రదింపుల్లో భాగంగా కేంద్రం మంత్రులు రాజ్ నాధ్ సింగ్, వెంకయ్య నాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో శుక్రవారం జరిపిన భేటీ ఎటువంటి ఫలితం ఇవ్వలేక పోయింది.  రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై రాజకీయ పార్టీలతో సంప్రదింపులే లక్ష్యంగా ఏర్పాటైన బీజేపీకి త్రిసభ్య కమిటీ ఇప్పటిదాకా బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఎం, ఏఐఎన్‌సీ(ఎన్‌ఆర్‌)లతో చర్చలు జరిపింది. 

అయితే ఎన్‌డీఏ అభ్యర్థి ఎవరో ప్రకటించిన తర్వాతే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయా పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అదే విధంగా సోనియా గాంధీ ని కలసినప్పుడు సహితం రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎవ్వరి పేరు సూచించక పోవడంతో ఎటువంటి ఫలితం లేకపోయింది. పైగా తమనే పేరు సూచించామని అడిగారని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు గులాబీ నబి ఆజాద్ చెప్పారు. 

ఈ విషయంలో తాము ఏకాభిప్రాయాన్ని కోరుకుంటున్నామని, అందరికీ ఆమోదయోగ్యమైన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తమ ఆకాంక్ష అని కాంగ్రెస్‌ పార్టీ గురువారం స్పష్టం చేసింది. అయితే బీజేపీ తమ అభ్యర్థి పేరును సూచించకుండా తమతో సంప్రదింపులు జరపడం వల్లన ప్రయోజనం ఏమిటని కాంగ్రెస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 

Related Articles

Most Read