అద్వానీకి దూరంగా బిజెపి నేతలు... కుట్ర కధనంకు చేకూరుతున్న బలం !

Posted 9 months ago | Category : national politics


అకస్మాత్తుగా సిబిఐ ప్రోద్భలంతో సుప్రీం కోర్ట్ బీజేపీ అగ్రనాయకులపై అయోధ్య కేసు తిరిగి తోడటం వెనుక బీజేపీలో జరిగిన కుట్ర కారణం అని చెలరేగిన అనుమానాలకు లక్నో లో ప్రత్యేక సిబిఐ కోర్ట్ ముందు హాజరు కావడానికి మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ, ఇతర నాయకులు వచ్చిన సందర్భంగా వారికి దూరంగా ఇతర నాయకులు ఉండటం బలం చేకూరుస్తున్నది. 

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ వచ్చి మర్యాద పూర్వకంగా అతిధి గృహంలో కలసి వెళ్లడం మినహా వారికి బిజెపి కార్యకర్తలు, నాయకులు భారీ స్వాగత సన్నాహాలు చేయక పోవడం గమనార్హం. సాక్షి మహారాజ్ వంటి అయోధ్య ఉద్యమంతో సంబంధం ఉన్నవారు తప్ప `అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎవ్వరూ అప్పలేరు' అంటూ సంఘీభావ ప్రకటనలను సహితం బిజెపి కేంద్ర నాయకులు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. 

రాష్ట్రపతి ఎన్నికలలో అద్వానీ అభ్యర్థిత్వం పట్ల సంఘ పరివార్ లో సుముఖత వ్యక్తం అవుతున్న సమయంలో అకస్మాత్తుగా ఈ కేసు తెరపైకి రావడం గమనార్హం. సిబిఐ పిటిషన్ కు స్పందించి సుప్రీం కోర్ట్ ఈ ఆదేశాన్ని ఇచ్చింది. సిబిఐ ని రాజకీయ ప్రయోజనాల నాకోసం ఉపయోగించు కోవడంలో కాంగ్రెస్ వారికి తానే మాత్రం తీసిపోనని నిరూపించు కొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రమేయం లేకుండా సీబీఐ ఇటువంటి చర్యకు ఉపక్రమించే అవకాశం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

పైగా అద్వానీ, జోషి తదితరులు కోర్ట్ కు హాజరవుతున్న రోజున ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నారు. బిజెపి అగ్రనాయకులు ఎవ్వరూ వారి వెంట లక్నో కు వచ్చి సంఘీభావం తెలిపే ప్రయత్నమే చేయలేదు. 

అద్వానీ వంటి బలమైన నాయకుడు రాష్ట్రపతి భావంలో ఉంటె 2019 ఎన్నికల్లో బిజెపి సొంతంగా మెజారిటీ తెచ్చుకోలేని పక్షంలో ఇబ్బందికరం అని మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా పలువురు భావిస్తున్నారు. అందుకనే సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని వారిని మాత్రమే రాష్ట్రపతి భవన్ కు పంపే ప్రయత్నంలో ఉన్నట్లు కనబడుతున్నది. 


జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted 2 hours ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 4 hours ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 12 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 17 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!