ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

అమిత్ షా `కాకి లెక్క'లపై బిజెపి నేతల కప్పదాటు

Posted 7 months ago state politics

మూడేళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ కు రూ 1 లక్ష కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ కు రూ 1.75 లక్షల కోట్లు మేరకు నిధులు సమకూర్చిన్నట్లు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్ట్రాలలో తన నాలుగు రోజుల పర్యటన సందర్భంగా తెలిపారు. అయితే ఇవన్నీ `కాకి లెక్కలే' అంటూ బిజెపి నాయకులు సహితం వ్యక్తి గతంగా అంగీకరిస్తున్నారు. 

ఈ లెక్కలను నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు సవాల్ చేస్తే బిజెపి నాయకుల ధోరణి దాటవేతగా ఉన్నది. 

ఇంతకు ముందు ఆంధ్ర ప్రదేశ్ పర్యటన సందర్భంగా అమిత్ షా ఇటువంటి ప్రకటనే చేస్తే, అవన్నీ తప్పుడు లెక్కలేని అంటూ ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కేంద్రం ఆమోదించిన పథకాలకు సంబంధించి రాగల ఐదు, పదేళ్లలో కాగల వ్యయాన్ని కూడా కలుపుకొని తాము అందిస్తున్న ఆర్ధిక సహాయంగా చెప్పు కొంటున్నారని బిజెపి కి చెందిన మాజీ యం ఎల్ సి ఒకరు అంగీకరించారు. 

కేసీఆర్ అడిగిన్నట్లుగా లక్ష కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి బిజెపి నాయకులు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అయితే శాసన సభలో గాని, ఎక్కడైనా బహిరంగ వేదికలో గాని ఈ విషయమై చర్చకు వస్తే తాము నిరూపిస్తామని అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ తెలిపారు. బహిరంగ వేదిక ఏ పార్టీకి చెందని ఒక వ్యక్తి ద్వారా జరగాలని కూడా షరతు విధించారు. 

కేసీఆర్ విమర్శ తరువాత లక్ష కోట్లకన్నా ఎక్కువే ఇచ్చామని అంటూ అమిత్ షా బహిరంగ సభలో చెప్పినా ఆ వివరాలు మాత్రం వెల్లడించక పోవడం గమనార్హం. ఇంతకు ముందు అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఇదే విధంగా తెలంగాణ కు రూ 75 వేల కోట్లు నిధులు ఇచ్చామని అంటే, ఆ వివరాలు తీసుకొని కరపత్రాలు ముద్రించి తెలంగాణ అంతటా విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్త్ర బిజెపి నేతలు భావించారు. 

అయితే ఆ తరువాత వారు అమిత్ షా కార్యాలయం, బిజెపి కేంద్ర కార్యాలయం లోని వారిని ఎన్ని సార్లు అడిగినా ఎవ్వరూ వివరాలు ఇవ్వక పోవడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. అందుకనే ఇప్పుడు అమిత్ షా చెప్పిన నిధుల లెక్కలను బిజెపి నాయకులు సహితం ఎవ్వరూ పట్టించు కోవడం లేదు. 

Most Read