ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

కాంగ్రెస్ గూటికి నాగం జనార్దన్ రెడ్డి!

Posted a month ago politics

తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉన్నదని.. రేవంత్ రెడ్డి ఏ ముహూర్తాన అన్నారో గానీ.. దానికి సంబంధించి మరో సంకేతం కూడా కనిపిస్తోంది. తెలంగాణలో ఎంతో సీనియర్ నాయకుడు అయినప్పటికీ.. భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ప్రాధాన్యం లేకుండా మొక్కుబడిగా.. కొనసాగుతున్న నాగం జనార్దనరెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన ఆయన.. అదే జిల్లాలో రాహుల్ గాంధీ త్వరలో నిర్వహంచబోయే భారీ బహిరంగ సభలోనే చేరవచ్చునని కూడా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

కేసీఆర్ కు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన తరుణం ఇదేనని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఆయన తెదేపా నుంచి కొందరు కీలక నాయకులు సహా కాంగ్రెస్ లో చేరారు. ఆయన ద్వారా కాంగ్రెసులో చేరడానికి మరికొంత మంది సిద్ధంగా ఉన్నారు. ఈలోగా.. ఎప్పటినుంచో రాజకీయ వాసనకే దూరంగా ఉన్న విజయశాంతి లాంటి వాళ్లు కూడా తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. ఆమె రాహుల్ ను కలిసి.. సామాన్య కార్యకర్తగా పార్టీ పని చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇలా కొన్ని శక్తులు ఏకమవుతున్న తరుణంలోనే.. అటు భాజపానుంచి కూడా ఇదే సంకేతాలు వస్తున్నాయి.

నాగం జనార్దనరెడ్డి ఎంతో సీనియర్ నాయకుడు. సబ్జెక్టు ఉన్న నాయకుడు. తెదేపా హయాంలో గతంలో చాలా కీలక పదవులు నిర్వర్తించారు. తెలంగాణ కోసం పోరాటం విషయంలో పార్టీతో విభేదించి సొంత పార్టీ పెట్టుకుని, దాన్ని నడపలేక తర్వాత కమలదళం పంచన చేరారు. అయితే ఆయనకు ఎన్నడూ సరైన ప్రాధాన్యం దక్కనే లేదు. 

కానీ తాను మాత్రం కేసీఆర్ కు వ్యతిరేకంగా, నిర్ణయాల్లో ఉండే లోపాలను ఎత్తిచూపుతూ.. చాలా రకాలుగా ఒంటరిపోరాటం సాగించారు. పాదయాత్రలు కూడా నిర్వహించారు. పార్టీ పరంగా మాత్రం ఆదరణ శూన్యం. చాలాకాలంగా ఆయన రాజకీయంగా స్తబ్ధుగానే ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో.. రాజకీయ శక్తుల పునరేకీకరణలో  భాగంగా.. ఆయన కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లుగా తెలుస్తున్నది. రేవంత్ రెడ్డితో నాగం కు పెద్దగా సఖ్యత లేదని నాయకులు చెబుతుంటారు. అయినా ఉన్న నాయకుల సంఖ్య కంటే ముఠాలు ఎక్కువగా ఉండడమే తమ సంస్కృతిగా యూఎస్‌పీగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇలా ఎంతమందినైనా చేర్చుకోగలరనే అందరూ అనుకుంటున్నారు

Related Articles

Most Read