ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

పశువధపై ఇరకాటంలో బిజెపి

Posted 6 months ago national politics

పశువధకోసం పశువుల  అమ్మకాన్ని నిషేధిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తరువు బీజేపీకి లో తికమక పరిస్థితులకు దారితీస్తున్నది. ఎన్నికలు  జరుగనున్న మేఘాలయలో బీఫ్‌పై నిషేధం విధించే ప్రసక్తి లేదని ఒక వంక పార్టీ ప్రచారం చేస్తూ ఉండగా, మరో వంక  గోవధ, పాలిచ్చే పశువుల అక్రమ రవాణాకు పాల్పడేవారిపై వారిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ), గూండా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

పశుమాంసాన్ని ఇష్టంగా తినే ఈశాన్య రాష్ర్టాల్లోని బీజేపీ నాయకులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఒక్కక్కరూ పార్టీని వీడుతున్నారు. గతవారం మేఘాలయ రాష్ట్రంలోని వెస్ట్ గారో హిల్స్ జిల్లా అధ్యక్షుడు బెర్నాడ్ మరాక్ తన పదవికి రాజీనామా చేయగా తాజాగా నార్త్ గారో హిల్స్ జిల్లా అధ్యక్షుడు బచు మరాక్ తన పదవికి రాజీనామా చేశారు. 

"పశుమాంసం తినడం అనేది మా సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం. లౌకికవాద వ్యతిరేక భావజాలాన్ని మాపై బలవంతంగా రుద్దితే మేం అంగీకరించం" అంటూ స్ఫష్టం చేశారు.  పైగా, ప్రతిసారి బీఫ్‌నే ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారు? పంది, కోడి, మేక మాంసం వంటివాటిపై ఎందుకు చర్చ జరుగడం లేదు అని ఆయన ప్రశ్నించారు . అయితే రాజీనామా చేసిన ఇద్దరు నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రావనే ఉద్దేశంతో పార్టీకి ద్రోహం చేస్తున్నారని అంటూ వారి వాదనలను బలహీన పరచే ప్రయత్నం బీజేపీ అధికారప్రతినిధి, మేఘాలయ ఇన్‌చార్జి నళిన్ కోహ్లి చేసారు. 

మరో వంక, గోవాలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న గోవా ఫార్వర్డ్ (జీఎఫ్‌పీ) పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బీఫ్ బ్యాన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వధించడం కోసం పశువుల అమ్మకాలు, కొనుగోళ్లను నిషేధించడం ద్వారా రైతులు, వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉన్నదని జీఎఫ్‌పీ నేత, గోవా వ్యవసాయశాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో తమ పార్టీ సంతోషంగా లేదని స్పష్టం చేశారు. 

ఇలా ఉండగా, పశుమాంసం ఎగుమతులు ఏప్రిల్ నెలలో 11.4 శాతం తాగ్గాయని వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా తలెత్తుతున్న నిరసనలను దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించు కోవడానికి సిద్ధం అని పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. 

Related Articles

Most Read