ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

మహేష్ ఫస్ట్ లుక్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న భారత్ అను నేను మూవీ టీం..!

Posted 5 days ago movies

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు “భరత్ అనే నేను” సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. కొత్త షెడ్యూల్  డిసెంబర్ 13 నుండి 26 వరకు తమిళనాడులోని కారైకుడిలో జరగనుంది. దీంతో 90 శాతం టాకీ పార్ట్ పూర్తవుతుంది. మిగిలిన మూడు పాటలు, ఒక ఫైట్ ను జనవరిలో చిత్రీకరించనున్నారు. అయితే మహేష్ సినిమా గురించి కొన్ని రోజులుగా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

మహేష్ తన అభిమానులకు కొత్తసంవత్సర కానుకగా భరత్ అనే నేను సినిమా ఫస్ట్ లుక్ ని డిసెంబర్ 31 సాయంత్రం రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారని, అలాగే ఏప్రిల్ 17న అల్లు అర్జున్ నా పేరు సూర్య, రజనీ 2.0 అదే రోజు రిలీజ్ కానుండడంతో రెండు వారాలు ముందుగానే “భరత్ అనే నేను” థియేటర్లోకి  వస్తుందని ప్రచారం సాగుతోంది.

ఈ వార్తలపై నేడు చిత్ర బృందం స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని , మహేష్ ఫస్ట్ లుక్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. అలాగే సినిమా రిలీజ్ డేట్ లో మార్పు లేదని వెల్లడించింది. ముందుగా ప్రకటించినట్లుగానే 2018 ఏప్రిల్ 17న భారః అనే నేను రిలీజ్ అవుతుందని పేర్కొంది.

ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Most Read