ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

జనసేన పై వ్యాఖ్యలుకు తెలుగు తమ్ములపై బాబు ఆగ్రహం

Posted 2 months ago politics

'పవన్ కల్యాణా.. ఆయనెవరో మాకు తెలీదు..' 'జనసేనా... అదొక పార్టీ ఉందా?' అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యానాల పట్ల పవన్ కల్యాణ్ తన అసహనం వ్యక్తం చేసినది తెలిసిన విషయమే. తనెవరో తెలీదు.. అని వ్యాఖ్యానించిన టీడీపీ నేతల పేర్లను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ ట్విటర్ లో వ్యంగ్యంగా స్పందించారు. ‘పవన్ కల్యాణ్ ఎవరో తెలీదా.. సంతోషం’ అని పీకే ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత ఈ వ్యవహారంపై స్పందించారని సమాచారం. పవన్ కల్యాణ్ విషయంలో ఎవరూ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలూ చేయవద్దని చంద్రబాబు తెలుగుదేశం నేతలను హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ‘పవన్ కల్యాణ్ మనకు మిత్రపక్షంగానే ఉన్నారు. అలాంటప్పుడు ఆయనపై ఇలాంటి మాటలు ఏమిటి. ఇలాంటి మాటలు ఎవరూ మాట్లాడవద్దు..’ అని చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.

2019 ఎన్నికలకు ముందు తమకు కావాల్సిన పార్టీలు, నేతల విషయంలో కాస్తంత ఆలోచించి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించుకోవడం వ్యూహాత్మకమే. అది రేపు ఫలితాలినిస్తుందని చెబుతున్నారు. అవసరమైతే జనసేన పొత్తుతో ముందుకు వెళ్లే ఆలోచన చేస్తోంది టీడీపీ, దానికి ముందే తమ మాటలతో తెగదాక లాగవద్దనేది బాబు సూచనగా ఉంది. అందుకే ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని ఆదేశాలిచ్చారంటున్నారు.

అలాగే జనసేనపై చేసిన వ్యాఖ్యల విషయంలో పితాని సత్యనారాయణ నుంచి టీడీపీ వివరణ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పవన్ పార్టీపై అలాంటి మాటలు ఎందుకు మాట్లాడారు? అని వివరణ అడిగారట. తను వ్యాఖ్యల్లో చెడు ఉద్దేశం లేదని, పవన్ కల్యాణ్ పార్టీ తెలుగుదేశానికి ప్రత్యర్థి కాదు, మిత్రపక్షమే అని చెప్పడమే తన ఉద్దేశమని పితాని వివరణ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో.. బాబు పార్టీ నేతలకు వార్నింగే ఇచ్చారట. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి కావాల్సిన వ్యక్తి, జనసేన టీడీపీకి మిత్రపక్షం.. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దు.. అని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.

Related Articles

Most Read