ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

అజర్, రేవంత్, రాములమ్మల చేరికతో తెలంగాణా కాంగ్రెస్ లో సందడే సందడి

Posted a month ago politics

తెలంగాణా కాంగ్రెస్ సందడి సందడి గా ఉంది కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి గీసుకున్న స్కెచ్చులో సగానికి పైగా ఆచరణలోకొచ్చేసింది. అనుకున్నట్లే రేవంత్ అనే 'బాహుబలి'ని పార్టీలో చేర్చుకున్న ఉత్తమ్.. కొంచెం గ్యాప్ తీసుకుని రాములమ్మ రీఎంట్రీ చేశారు .అంతకుముందు అజారుద్దీన్ మా తరఫున ఆడాల్సిందే అంటూ 'ఆహ్వానించారు. ఇప్పటికైతే తెలంగాణాలో కొత్త కాంగ్రెస్ కాస్త నిండుగా కనిపిస్తోంది.కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు దారిచూసుకోవడమో, ఆవిరైపోవదమో సహజం.అలా.. సీనియర్లు జారుకోకుండా, జావగారిపోకుండా చేయాల్సిన ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ నేతలకు తప్పడం లేదు. రాహుల్ తో కలిసి తీసుకున్న గ్రూప్ ఫొటోలే తర్వాత జరిగిన డెవలప్ మెంట్స్ ఏమీటనేది ప్రశ్న

రేణుక లాంటి సీనియర్లతో రేవంత్ జరుపుతున్న 'రహస్య' భేటీలు.. వాటి ఫలితాలు ఏమిటన్న దానిమీదే టీ-కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి వుందన్నది వాస్తవం. కేసీఆర్ ను ఆలోచింపజేసే స్థాయికైతే టీ-కాంగ్రెస్ బలపడిందంటూ విశ్లేషణలు వస్తున్నాయి. ఈ మరుగుజ్జులు మమ్మల్నేమీ చేయలేవంటూ కేటీఆర్ ఎద్దేవా చేసినప్పటికీ..తెలంగాణ భవన్లో రేవంత్ మీద 'టాక్' మాత్రం గట్టిగానే నడుస్తోంది.అయితే.. ఉత్తమ్ వర్కవుట్ చేస్తున్న ప్లాన్-బీ ఎంత మేరకు సఫలం అవుతుంది..? కేసీఆర్ చాణక్యత ముందు ఈ యుక్తులు నిలబడతాయా?

అనే డౌట్లు కూడా లేకపోవు. ఇప్పటికే కొడంగల్ ఖాళీ అవుతోందని, టీడీపీ క్యాడర్ మొత్తం టీఆరెస్ లో చేరిపోయిందని వార్తలొస్తున్నాయి. అటు.. తెలంగాణాలో రాములమ్మ స్టామినా ఏమిటన్న లెక్కలు కూడా తీస్తున్నారు.అసలే 'వలస తెలంగాణ వాది'గా పేరున్న విజయశాంతికి ఫలానా జిల్లాల్లో పట్టుందని చెప్పుకునే అవకాశమే లేదు. మెదక్ ఎంపీగా గెలిచినప్పటికీ స్దానబలం ఏర్పర్చుకోలేక పోయింది. కేవలం స్టార్ క్యాంపెయినర్ గా మాత్రమే విజయశాంతిని వాడుకోవాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ కావొచ్చు!

కేసీఆర్ బెటాలియన్‌ని ఎదుర్కోడానికి ఈ సామర్థ్యం సరిపోతుందా? కొత్తగా మరిన్ని చేరికలున్నాయని చెబుతున్నప్పటికీ..వాళ్లలో స్టార్ వ్యాల్యూ వున్నవాళ్లు ఎంతమంది? జేఏసీ నేత కోదండరాం కలిసొస్తారా? ప్రజా, ఉద్యోగ, విద్యార్ధి సంఘాలు ఎటువైపున్నాయి..? రేపటిరోజున రేవంత్ పిలుపునందుకుని అవన్నీ కలిసొస్తాయా?రేవంత్ చెబుతూ వస్తున్న 'కేసీఆర్ వ్యతిరేక శక్తుల ఏకీకరణ' సాధ్యమవ్వాలంటే చెయ్యాల్సిన కసరత్తు ఏమిటన్నవి ప్రశ్నలు. ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీ పెట్టే యోచనలో వున్నారంటూ వార్తలొస్తున్నాయి. అదే గనుక జరిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటు అనేది ప్రశ్న.

Related Articles

Most Read