ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

భూదందాలపై తిరగబడండి... మంత్రి అయ్యన్న పిలుపు

Posted 6 months ago state politics

ఆంధ్ర ప్రదేశ్ కు ఆర్దిక రాజధానిగా భావిస్తున్న విశాఖపట్నంలో యధేచ్చగా సాగుతున్న భూ దందా దోపిడీలపై నేరుగా రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు  అసహనం వ్యక్తం చేయడం అధికార తెలుగు దేశం పార్టీలో కలకలం రేపింది. పైగా ఈ తరహా దందాలపై ప్రజలు తిరుగుబాటు చేయాలని మంత్రి పిలుపిచ్చారు. ఎక్కడి నుంచో వచ్చి కొందరు విశాఖలో భూ దందా చేస్తున్నార ని,వారికి ప్రజలు ఎదురు తిరగాలని కూడా కోరారు. 

విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో అధికార పక్షంలోని ప్రముఖుల సారధ్యంలో భూదందాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు కొంతకాలంగా కధనాలు వస్తున్నా కదలిక లేక పోయినా మంత్రి వాఖ్యలతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన కొద్దీ గంటలకే జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ఈ వివాదాలపై సమగ్ర విచారణ చేసి వారంలోగా నివేదిక ఇవ్వాలని కోరారు. పైగా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశాలిచ్చారు. 

మంత్రి అయ్యన్నపాత్రుడు నవనిర్మాణ దీక్షలో పాల్గొంటూ ఇటువంటి దండాలను ఎందుకు అరికట్టలేకపోతున్నామో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలంటూ సొంత పార్టీ వారికే చురకలు వేశారు.  రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఈ వ్యవహారం కొనసాగుతుందా అని మంత్రి ప్రశ్నించడంతో ప్రభత్వం ఇరకాటంలో పడినట్లయింది.

విశాఖ జిల్లాలో భారీగా భూ రికార్డులు గల్లంతు కావడం, 1బీ రికార్డుల్ని తారుమారు చేయడం లాంటి కుంభకోణాలతో వివాదాలు రేకెత్తడంపై  కధనాలు రావడం గమనార్హం. రూ.20వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు, భారీగా ప్రైవేట్‌ వ్యక్తుల భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నెల 15న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బహిరంగ విచారణ చేపట్టబోతున్నారు.

ఇట్లా ఉండగా, లక్ష ఎకరాలకు సంబంధించిన భూ చిత్రపటాలు (ఎఫ్‌ఎంబీలు) గల్లంతు కావడం విస్మయం కలిగిస్తున్నది. 233 గ్రామాలకు సంబంధించిన ఎఫ్‌ఎంబీలు, 375 రీసెటిల్‌మెంట్‌ రిజిస్టర్లు మాయమయ్యాయి. 2.95లక్షల అడంగల్‌ కాపీలు కనిపించడం లేదు. ఈ మాయాజాలంపై రెవెన్యూ, సర్వే ఉన్నతాధికారుల్లో కలకలం మొదలైంది. 

Most Read