//single page style gallary page

ఐటీ రంగంలో మరో షాక్ త్వరలో....లక్షల ఐటీ ఉద్యోగులపై వేటు!

Posted 9 months ago | Category : business

ఇటీవలి కాలంలో వరుసగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోతకు గురువుతున్న సమయంలో మరో షాకింగ్ జోస్యం వెలువడింది. లే ఆఫ్ కారణంగా బిక్కచచ్చిపోతున్న ఐటీ ఉద్యోగులపై మరో కొత్త కత్తి వేలాడుతోందని విశ్లేషించింది. వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఆటోమేషన్ వల్ల లక్షలాది మంది ఉపాధికి ఎసరు పడనుందని తాజా నివేదిక ఒకటి విశ్లేషించింది. ప్రతి మూడింటిలో ఒక్క ఉద్యోగం ఊడనుందని అమెరికా కేంద్రంగా పని చేస్తున్న హెచ్ ఎఫ్ ఎస్ రీసెర్చ్ అంచనా వేసింది.

ఆటోమేషన్ దెబ్బతో ఐటీలో వచ్చే 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షల ఉద్యోగాలు పోతాయని హెచ్చరించింది. ఇందులో మధ్యస్థ - అత్యధిక నైపుణ్యం కలిగిన వాటిలో కూడా లక్ష నుంచి 1.9 లక్షల ఉద్యోగాలు పోవచ్చని పేర్కొంది. ముఖ్యంగా అమెరికా - బ్రిటన్ - భారత్ లాంటి దేశాల్లో నికర ఉద్యోగుల సంఖ్య 7.5 శాతం మేర పడిపోవచ్చని హెచ్ ఎఫ్ ఎస్ అంచనా వేసింది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్ పీఏ) - కృత్రిమ మేథస్సు (ఏఐ) వల్ల ఈ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఇదే సమయంలో ఆటోమేషన్ లో అత్యధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో 57 శాతం పెరుగుదల ఉండొచ్చని పేర్కొంది. కాగా 2021 నాటికి తక్కువ నైపుణ్యం కలిగిన 6.4 లక్షల ఉద్యోగాలు పోతాయని ఇది వరకు ఇదే సంస్థ అంచనా వేసింది. ఉద్యోగాలు పోకుండా ఉండాలంటే మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మంది పునర్ నైపుణ్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కాగా భవిష్యత్తు కోసం సంబంధిత కంపెనీలు తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత కూడా వాటిపై ఉందని ఈ రిపోర్టు స్పష్టం చేసింది.


షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

Posted 14 days ago | Category : business

షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

Posted 17 days ago | Category : business

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

బ్యాంకింగ్ వ్యవస్థ పై సివిసి కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

Posted 2 months ago | Category : business

 బ్యాంకింగ్ వ్యవస్థ పై  సివిసి  కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

Posted 2 months ago | Category : business

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted 3 months ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 3 months ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 3 months ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 3 months ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 3 months ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 4 months ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 4 months ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..