ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

భూమికి ముప్పు ముంచుకొస్తుందంటున్న ఖగోళ శాస్త్రవేత్త!

Posted 5 months ago world

భూమిని ఉల్క ఢీకొట్టడం ఖాయమని అందు కోసం ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఐర్లాండ్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త అలాన్ ఫిట్జ్ సిమ్మన్స్ హెచ్చరించారు. అంతే కాదు ఢీకోట్టడానికి ముందే అది ముక్కలుగా విడిపోవచ్చని క్వీన్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్న సిమ్మన్స్ పేర్కొన్నారు. సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతాన్ని 1908 జూన్ 30న ఒక చిన్న ఉల్క ఢీకొట్టడంతో 800 చదరపు మైళ్ల భూభాగం సర్వనాశనమైందని తెలిపారు. గ్రహశకలం విధ్వంసం కారణంగానే ఆ రోజును ప్రపంచ ఆస్ట్రాయిడ్ డేగా నిర్ణయించారని ఫిట్జ్‌సిమ్మన్స్ తెలియజేశారు. ప్రస్తుత తరుణంలో ఆ స్థాయి గ్రహశకలం ఢీకొంటే ఒక పెద్ద నగరం బశ్వం అవుతుందని అన్నారు.

పెద్ద ఉల్క ఢీకొంటే జరిగే నష్టం అపారమని, ఎంతో ప్రమాదకరంగా ఉంటుందని చెప్పారు. మన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఎంతో కృషి చేసి భూమికి సమీపంలో మనకు హాని కలిగించే 1800 ఉల్కలనును గుర్తించారని, అయితే ఇంకా చాలా వాటిని గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రోజూ మన శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉండే ఉల్కలను గుర్తిస్తూనే ఉంటారని, అయితే వాటి వల్ల హాని జరగదని తెలిపారు. ఒక ప్రమాదకర ఘటన ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉందని, కాబట్టి అందరూ దీనికి సిద్ధంగా ఉండాలని హెచ్చిరించారు. జూన్ 30 న ప్రపంచ ఆస్ట్రాయిడ్ డే సందర్భంగా లక్సెంబర్గ్‌ వేదికగా ఖగోళ శాస్త్రవేత్తలు, నిపుణులతో జరిగే చర్చలో సిమ్మన్స్ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేయనున్నారు.

Most Read