ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

కేసీఆర్ పాలనపై ప్రసంశలు కురిపించిన..... ఒవైసీ

Posted 4 months ago politics

హైదరాబాద్ లో ఉన్న మజ్లిస్ పార్టీ గత కొద్దికాలంగా తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీతో సఖ్యతగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. పలు ఎన్నికలు మొదలుకొని ప్రజా సమస్యల వరకు మజ్లిస్ అధినేతలైన ఓవైసీలు గులాబీ దళపతి కేసీఆర్ తో దోస్తీ నడుపుతున్నారు. ఏకకాలంలో అటు బీజేపీ రథసారథి నరేంద్ర మోడీతో ఇటు ఎంఐఎం అధినేత ఓవైసీతో మితృత్వం కొనసాగించడం కేసీఆర్ ప్రత్యేకత అని పలువురు ప్రశంసిస్తున్న తీరు టీఆర్ ఎస్ నేత చాణక్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే హైదరాబాదీల్లో పెద్ద ఎత్తున పట్టున్న ఓవైసీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై తమకు ఉన్న నమ్మకాన్ని మరోమారు చాటుకున్నారు.

సాధారణంగా ఒక రాజకీయ పార్టీ అధినేత మారే ఏ రాజకీయ పార్టీని ప్రశంసించడు. ఏదో ఒకోసారి ప్రశంసించిన మొహమాటంగానే ఉంటుంది.కానీ ఎంఐఎం వంటి ఒక పురాతన, చారిత్రాత్మక నేపథ్యంగల పార్టీ అధినేత,దేశంలోని కీలకవర్గం ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు ఈ విధంగా మరో పార్టీని పొగడడటం భారత రాజకీయాలలో ఒక సంచలనం అనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మజ్లిస్ అధినేత - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ``తెలంగాణలో కేసీఆర్ ఉన్నంతకాలం... ఇక్కడ అధికారంలో వస్తామని కలలు కనడం గెలుస్తామని ఆశపడటం బీజేపీ మరిచిపోవాలి. రాబోయే రోజుల్లో ప్రస్తుత ఎమ్మెల్యే - ఎంపీ సీట్లను కాపాడుకోవడం బీజేపీకి కష్టం`` అని అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. తద్వారా గులాబీ దళపతి కేసీఆర్ కు రాష్ట్రంలో ఎంత పట్టు ఉందో చెప్పే ప్రయత్నం చేశారు. ఒవైసీ చేసిన ట్విట్ కి భారీ సంఖ్యలో లైక్స్, వందలాది మంది షేర్ చెయ్యటం అంతే కాదు సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజల అభిమానం పొందటం అబ్బో చాల జరిగాయి. ఏదిఏమైనా ఇది సమకాలీన రాజకీయాల్లో ఒక్క కేసీఆర్ కె చెల్లుబాటైందంటూ పలువురు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు.

Related Articles

Most Read