//single page style gallary page

చిన్న చిన్న ఆసుపత్రులను కొనుగోలు చేయనున్న అపోలో

Posted a year ago | Category : business

తమ ఆసుపత్రుల పరిధిని జాతీయ స్థాయిలో విస్తరింప చేసుకోవడం కోసం ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో చిన్న చిన్న ఆసుపత్రులను కొనుగోలు చేయాలని  అపోలో ఆసుపత్రి యాజమాన్యం నిర్ణయించింది. గత సంవత్సరం గౌహతి లో అస్సాం హాస్పిటల్ లో అత్యధిక వాటాలు కొనుగోలు చేయడం ద్వారా ఈశాన్య ప్రాంతాలకు విస్తరించింది. 

ఈ సంవత్సరంలో  దేశంలో మొదటి సారిగా కాన్సర్ చికిత్సకు ప్రోటాన్ థెరపీ కేంద్రంతో పాటు కొత్తగా ఆసుపత్రుల కొనుగోలుకు రూ 300 కోట్ల మేరకు ఖర్చు చేయాలని  భావిస్తున్నారు. ఇప్పటికే రూ 750 కోట్ల మేరకు షేర్ల అమ్మకం ద్వారా సేకరించాలని ప్రతిపాదన కొంతకాలంగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహ బోర్డు వద్ద పెండింగ్ లో ఉంది. 

ఈ బోర్డు ను రద్దుచేసే ప్రతిపాదనలో కేంద్ర ప్రభుత్వం ఉండడంతో కొత్తగా ఎటువంటి ప్రతిపాదనలను పరిశీలించడం లేదు. అంతర్గత నిధులతో పాటు, ఈ విధంగా షేర్ల ద్వారా వచ్చే ఆదాయంతో విస్తరణకు నిధులు సమకూర్చు కోవాలని భావిస్తున్నారు. షేర్ల ఆదాయంలో కొంత మేరకు అప్పులను తిరిగి చెల్లించడం కూడా చేయవలసి ఉంది. 

ప్రస్తుతం అపోలో కు చెల్లింపు వలసిన రూ 2,700 కోట్ల స్థూల రుణాలు, రూ 2,400 కోట్ల నికర రుణాలు ఉన్నాయి. ఈ మొత్తాలను రూ 2,500 కోట్లకు తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 30 తో ముగిసిన త్రైమాసంలో లాభాలు గత సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకొంటే 51.2 శాతం, అంటే రూ 35,2 కోట్లు తగ్గిన్నట్లు యాజమాన్యం ప్రకటించింది. 

గత మూడేళ్ళలో సమకూర్చుకున్న 2,000 కు పైగా అదనపు పథకాలకు ఎక్కువగా తరుగుదల, వడ్డీల కారణంగా లాభాలు తగ్గిన్నట్లు చెబుతున్నారు. వచ్చే రెండు, మూడు సంవత్సరాలలో నిర్వహణలో ఆదాయాలు గణనీయంగా పెరగ గలవని విశ్వసిస్తున్నారు. నావి ముంబై లో గత సంవత్సరం ప్రారంభించిన ఆసుపత్రిలో రూ 15 కోట్ల మేరకు నష్టం రాగా, ఈ సంవత్సరం నష్టం లేని పరిస్థితికి చేరుకోగలమని భావిస్తున్నారు. 

ఐకీయా వెనక ఉన్న అసలు నిజం ఇదే....

Posted 10 days ago | Category : business

 ఐకీయా వెనక ఉన్న  అసలు  నిజం ఇదే....

జోరుకి బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

Posted 11 days ago | Category : business

జోరుకి  బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!

Posted 12 days ago | Category : state business

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!

తెలంగాణ టూరిజం కన్క్లేవ్ 2018.....!

Posted a month ago | Category : business state

తెలంగాణ టూరిజం కన్క్లేవ్ 2018.....!

ముగిసిన మార్కెట్.... లాభాల్లో సెన్సెక్స్‌.... నష్టాల్లో నిఫ్టీ

Posted a month ago | Category : business

ముగిసిన మార్కెట్.... లాభాల్లో సెన్సెక్స్‌.... నష్టాల్లో నిఫ్టీ

స్టాక్‌మార్కెట్‌ జోరు... లాభాల్లో ముగిసిన సెన్సెక్స్

Posted a month ago | Category : business

స్టాక్‌మార్కెట్‌ జోరు... లాభాల్లో ముగిసిన సెన్సెక్స్

ఫ్లిప్‌కార్ట్‌ లో జాబ్స్.......యువత కి చక్కని అవకాశం...!

Posted a month ago | Category : business

ఫ్లిప్‌కార్ట్‌ లో జాబ్స్.......యువత కి చక్కని అవకాశం...!

నాగార్జున యాడ్ ను తొలగించిన కల్యాణ్ జువెల్లర్స్......!

Posted a month ago | Category : movies business

నాగార్జున యాడ్ ను తొలగించిన కల్యాణ్ జువెల్లర్స్......!

టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు ఇక చౌక ధరకే...!

Posted a month ago | Category : state business

టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు ఇక చౌక ధరకే...!

జియో మరో ఆఫర్...

Posted a month ago | Category : business

జియో మరో ఆఫర్...

మరో సంచలనానికి జియో సిద్ధం........!

Posted a month ago | Category : national business

మరో సంచలనానికి జియో సిద్ధం........!