అంతరిక్షంలోకి భారతీయ అమెరికన్‌ రాజాచారి

Posted 7 months ago | Category : world

మరో భారతీయ అమెరికన్‌కు అంతరిక్షంలోకి దూసుకుపోయే అవకాశం లభించింది. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రాజాచారి వారి వారసత్వాన్ని కొనసాగించబోతున్నారు. అమెరికా వైమానికదళంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేస్తున్న రాజాచారి నాసా వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికయ్యారు.

భవిష్యత్‌లో నాసా చేపట్టే సుదీర్ఘ అంతరిక్షయాత్రల కోసం ఎంపిక చేసిన 12 మందిలో ఆయన ఒకరు. 18,300 దరఖాస్తుల్లో నుంచి వీరిని ఎంపిక చేశారు. 39 సంవత్సరాల చారి అయోవా రాష్ట్రానికి చెందినవారు. ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ అందుకున్న తర్వాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదివారు. అమెరికా నౌకాదళ టెస్ట్‌పైలట్ స్కూల్‌లో శిక్షణ అనంతరం ఆయన వైమానిక దళంలో చేరారు.

ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో 461 ఫ్లయిట్ టెస్ట్ స్కాడ్రన్ కమాండర్‌గా, ఎఫ్-35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఇరాక్ ఆపరేషన్స్‌లో పాల్గొన్న అనుభవం ఆయనకు ఉన్నది. 

హ్యూస్టన్‌లో జరిగిన వ్యోమగామి అభ్యర్థుల పరిచయ కార్యక్రమానికి అమెరికా ఉపాధ్యక్షుడు మైకె పెన్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెన్స్ మాట్లాడుతూ అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిభ, సాహసం అంతరిక్ష అన్వేషణలో దేశాన్ని సమున్నత శిఖరాలకు చేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!