ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

దినకరన్ భయంతో ఆగిపోయిన అన్నాడియంకె విలీనం

Posted 4 months ago politics

అన్నాడియంకె లో రెండు వారి వర్గాలు విలీన ప్రక్రియకు సుముఖత వ్యక్తం చేస్తూ శుక్రవారం సాయంత్రం జయలలిత సమాధి వద్ద ప్రకటన చేయడానికి రంగం సిద్ధం కాగా అనూహ్యంగా చివరి నిముషంలో ఆగిపోయింది. విలీనం జరిగితే దినకరన్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రమాదమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. 

విలీనానికి సూచికగా ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వం సాయంత్రం 7 గంటలకు జయలలిత సమాధి వద్ద ప్రార్ధనలు చేయగలరని ప్రచారం జరిగింది. అందుకు అనువుగా ఆ ప్రాంతాన్ని అలంకరించారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. 

ఈ ఇద్దరు నాయకుల మద్దతు దారులలో సహితం భిన్న ధోరణులు వినిపించడమతొ పాటు, దినకరన్ కు ప్రభుత్వాన్ని పడగొట్టగల బలం ఉన్నాడనే భయం కూడా వారిని వెనుకకు నెట్టుతున్నట్లు తెలుస్తున్నది. ఈ మధ్య మధురైకు దగ్గరలో జరిపిన ర్యాలీ లో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అవసరమైన 23 మంది శాసన సభ్యుల బలాన్ని ప్రదర్శించాడు. వారిలో 20 మంది అన్నాడియంకె కు చెందిన వారు కాగా, ముగ్గురు స్వాతంత్ర్యులు. 

తనకు మరో కొందరు శాసన సభ్యుల మద్దతు కూడా ఉన్నదని, వారు తగు సమయంలో బయటకు వస్తారని ప్రకటించాడు. మరోవంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన పన్నీరుసెల్వం వర్గం సమావేశం పొద్దుబోయే వరకు సాగింది. 13మంది ముఖ్యనాయకులలో 9 మంది విలీనానికి వ్యతిరేకించారు. 

జయలలిత మృతిపై న్యాయ విచారణ కాకూండా సిబిఐ దార్యప్తుకు ఆదేశించాలని, శశికళని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు సమర్పించిన లేఖను ఎన్నికల కమీషన్ నుండి ఉపసంహరించు కోవాలని ప్రధానంగా డిమాండ్ చేయడంతో పాటు ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టాలని కూడా స్పష్టం చేస్తున్నారు.  ఈ సందర్భంగా కేంద్రంలో బిజెపి నుండి విలీనం కోసం వస్తున్న వత్తిడి కారణంగా కొన్ని డిమాండ్ లపై పట్టుబట్టలేక పోతున్నామని ఒక నాయకుడు చెప్పిన్నట్లు తెలిసింది.

Related Articles

Most Read