అన్నాడీఎంకే వర్గాలు విలీనం .. శశికళ ను సాగనంపే నిర్ణయం !

Posted 6 months ago | Category : politics

తమిళనాడులో ఆరేడు నెలలుగా అధికార పార్టీ అన్నాడీఎంకే లో నెలకొన్న వర్గ వైషమ్యాలకు తెరపడింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన తర్వాత చీలిన పన్నీర్‌ సెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమయ్యాయి. గత కొన్ని రోజులుగా నడస్తున్న అన్నాడీఎంకే వర్గాల విలీన వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన భేటీ అనంతరం రెండు వర్గాలు విలీనం అవుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ప్రకటించారు. ఈ సందర్భంగా వికె శశికళను పార్టీ నుండి సాగనంపడానికి ముఖ్యమంత్రి పళనిస్వామి ఆమోదం తెలిపిన్నట్లు తెలిసింది.

తదుపరి జయలలిత సమాధి వద్ద సమావేశమై కలసి పనిచేయనున్నట్లు సంకేతం ఇచ్చారు. ఈ సందర్భంగా పన్నీర్‌ సెల్వం మాట్లాడుతూ పార్టీ ఐక్యమత్యం కోసం శాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. ఈ రోజుతో తనపై ఉన్న భారం తొలగిపోయిందని,   విలీనానికి సంతోషంగా అంగీకరించామని పేర్కొన్నారు. జయలలిత ఇచ్చిన హామీలను పూర్తిగా అమలుచేస్తామని ఆయన స్పష్టంచేశారు.

ఇది చారిత్రాత్మక సంఘటన అని అంటూ తమిళనాడు చరిత్రలో విడిపోయిన పార్టీలు ఏవీ తిరిగి కలవలేదని సీఎం పళనిస్వామి గుర్తు చేసారు. అలా కలిసిన పార్టీ అన్నాడీఎంకే మాత్రమేనని చెప్పారు. పార్టీని ఇకపై మార్గదర్శక కమిటీ నిర్వహిస్తుందని స్పష్టంచేశారు. మార్గదర్శక కమిటీకి పన్నీర్‌ సెల్వం కన్వీనర్‌గా వ్యవహరిస్తారని వెల్లడించారు. రెండాకుల గుర్తును తిరిగి పొందేందుకే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు.

పన్నీర్‌ వర్గం పళని మంత్రివర్గంలోకి చేరనుంది. పన్నీర్‌ సెల్వం వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంగా, అన్నాడీఎంకే పార్టీ మార్గదర్శక కమిటీకి కన్వీనర్‌గా పన్నీర్‌ సెల్వం, సహ కన్వీనర్‌గా పళనిస్వామి వ్యవహరించనున్నారు. ఈ సాయంత్రం 4.30గంటలకు తమిళనాడు మంత్రివర్గ విస్తరణ జరగనుంది.


రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 13 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 4 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 4 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!