కేజ్రీవాల్ ప్రభుత్వం కూల్చడమే అమిత్ షా వ్యూహం !

Posted 9 months ago | Category : national politics

ఢిల్లీ లో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని యుపి, పంజాబ్ ఎన్నికలకన్నా ముందే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గ్రహించారు. అందుకు ఆప్ లోని కొందరు సహకరిస్తున్నారని కూడా తెలుసుకున్నారు. అయితే అమిత్ షా తో చేతులు కలిపింది ఎవ్వరో తెలుసుకొనే సరికి ఆలస్యమైపోయింది. 

సీనియర్ యం ఎల్ ఏ అయిన కపిల్ మిశ్రా తిరుగుబాటు జరుపుతారని అనుకోలేదు. ఆయనకు మిత్రుడైన ఆప్ వ్యవస్థాపక సభ్యుడు కుమార్ విశ్వాస్ ను అనుమానించారు. అందుకనే పంజాబ్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచారు. ఎన్నికల్లో పరాజయం పొందగానే కేజ్రీవాల్ చుట్టూ చేరిన `భజన బృందం' కారణం అంటూ పలువురు యం ఎల్ ఏ లతో కలసి విమర్శలు చేసారు. 

విశ్వాస్ తిరగబడితే కష్టం అని గుర్తించి ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి, రాజస్థాన్ పార్టీ ఇన్ ఛార్జ్ గా నియమించి కేజ్రీవాల్ జాగ్రత్త పడ్డారు. అయితే కుమార్ మిశ్రా తిరగబడడంతో ఒకవిధంగా షాక్ తిన్నారు. మిశ్రా తల్లి బిజెపి సభ్యురాలు కావడంతో ఆమె ద్వారా షా ప్రభావితం చేశారని అనుమానిస్తున్నారు. 

ఇంతకు ముందు రూ 2 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపించిన మిశ్రా తాజాగా సిబిఐ దర్యాప్తు జరపాలని కోరుతూ కేజ్రీవాల్ పై ఘాటైన ఆరోపణలు చేశారు. ఆప్ ఈసీకి త‌ప్పుడు బ్యాంక్ డిక్ల‌రేష‌న్ ను సమ‌ర్పించారని, నకిలీ విరాళాల వివరాలు అందించారని అంటూ కేజ్రీవాల్‌కు హ‌వాలా బ్రోక‌ర్ల‌తో లింకులు ఉన్నాయని, 16 షెల్ కంపెనీల‌ను నెల‌కొల్పి మూడేళ్లుగా బ్లాక్ మ‌నీని వైట్‌గా మార్చుతున్నరని అంటూ విరుచుకుపడ్డారు. 

గతంలో బిజెపి చేసిన ఆరోపణలని ఇప్పుడు మిశ్రా చేస్తున్నారని, మిశ్ర చెప్పిన వాటిని బిజెపి తిరిగి చెబుతున్నదని ఆప్ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ ఆరోపించారు. 


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 7 hours ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 8 hours ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 16 hours ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted a day ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted a day ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!