ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

మహిళా నేతలను దారిలోకి తెచ్చుకున్న అమిత్ షా

Posted 4 months ago politics

జాతీయ రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని అమిత్ షా ఒకేసారి ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా పార్టీ అధ్యక్షుడిగా  మారినా మొదట్లో పలువురు బిజెపి నేతలు ఆయనను పట్టించుకోలేదు. అయితే అటువంటి వారి పట్ల `కక్షసాధింపు' చర్యలకు గురిచేయడం ద్వారా వారిని దారిలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేశారు.

ఆ విధంగా అమిత్ షా దారిలోకి తెచ్చుకున్న వారిలో ఇద్దరు ప్రముఖమైన మహిళా నేతలు ఉన్నారు. మోదీ ప్రభుత్వంలో కీలకమైన మానవవనరుల శాఖ మంత్రిగా ప్రముఖమైన అధికార కేంద్రంగా మారిన స్మృతి ఇరాని వారిలో ఒకరైతే, రాజస్థాన్  ముఖ్యమంత్రి వసుంధర రాజే మరొకరు. వారిద్దరూ అన్ని విషయాలలో నేరుగా ప్రధాని వద్దకు వెడుతూ అమిత్ షా ఉనికిని పట్టించుకొనే వారు కాదు.

తన ఉనికి తెలపడం కోసమై స్మృతి ఇరానిని అంతగా ప్రాధాన్యత లేని జౌళి శాఖ కు మార్చేటట్లు పార్టీ అధ్యక్షుడే చేశారని పలువురు భావిస్తున్నారు. ఆమెకు బిజెపి కార్యవర్గంలో స్థానం కూడా కల్పించని లేదు. జాతీయ కార్యవర్గం సమావేశం జరుగుతున్న సమయంలో గోవా లో ఒక షో రూమ్ లో దుస్తువులు మార్చుకొనే గదిలో తనను రహస్యంగా షూట్ చేశారని అంటూ పెను వివాదం రేపి వార్తలకు ఎక్కడంతో పార్టీ సమావేశం గురించి ఎవ్వరు పట్టించుకోలేదని ఆయన మరింత ఆగ్రహానికి గురయ్యారు.

జరిగిన పొరపాటు గ్రహించి వరుసగా ఉత్తర ప్రదేశ్ లో, ముఖ్యంగా అమేథీలో పర్యటనలు జరుపుతూ అమిత్ షా ద్రుష్టి ఆకట్టుకొనే ప్రయత్నం ఆమె చేసారు. దానితో సమాచార శాఖ అదనపు బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా షా ఆమెకు రివార్డ్ ఇచ్చారు.

ఇక వసుంధర రాజే పై లలిత్ మోడీ వివాదం చుట్టుముట్టినప్పుడు పార్టీ నేతలు ఎవ్వరు ఆమెకు మద్దతుగా రాలేదు. పైగా 2018 ఎన్నికల్లో పార్టీ సియం అభ్యర్థి ఆమె కాకపోవచ్చని వార్తలు కూడా వచ్చాయి. అయితే గతవారం అమిత్ షా రాజస్థాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయనకు `ఘనమైన మహారాజ' స్వాగత సత్కారాలను ఏర్పాటు చేయడం ద్వారా వసుంధర ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

దాదాపు మొత్తం మంత్రివర్గం సహచరులతో కలసి విమానాశ్రయం వద్ద ఆయనకు ఆమె స్వాగతం పలికారు. ఆయన ఎక్కడకు వెడితే అక్కడకు ఆయనతో పాటు ఆమె పర్యటించారు. రాజవంశీయులైన ఆమె ఒక దళిత్ కార్యకర్త ఇంట్లో అమిత్ షా తో కలసి నేలపై కూర్చొని భోజనం చేశారు కూడా.

Related Articles

Most Read