ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

పండుగ వలే సూర్యగ్రహణం వీక్షించిన అమెరికన్లు

Posted 3 months ago world

అమెరికా ఆ చివర నుంచి ఈ చివర దాకా సోమవారం సూర్యగ్రహణం చుట్టేసింది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు అమెరికా పౌరులు ఎగబడడంతో రహదారుల మీద ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. టీషర్టులు, బటన్‌లు, కేకులు మొదలైన ప్రత్యేక ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తాయి.

అమెరికా చరిత్రలోనే అత్యధికంగా దాదాపు 20 కోట్ల మంది వీక్షించినట్లు అంచనా. ఒరెగాన్‌లోని సలెంలో గల థియేటర్‌లో ఒరెగాన్‌ మ్యూజియం ఆఫ్‌ సైన్స్‌, ఇండస్ట్రీవారు ప్రత్యేక వ్యాఖ్యానంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వేలాదిమంది హాజరయ్యారు. ఒరెగాన్‌ నుంచి దక్షిణ కరోలినా వరకు 14 రాష్ట్రాల మీదుగా 96 కిమీ నుంచి 113 కిమీ మేర చీకటి ఆవరించింది. ఆయా ప్రాంతాల్లో రెండు నుంచి మూడు నిముషాలపాటు పట్టపగలే దట్టమైన చీకటి అలముకుంది.

సుమారు వందేండ్ల తర్వాత వచ్చిన మహా సూర్యగ్రహణాన్ని కండ్లారా చూసేందుకు ప్రజలు ఆహారపదార్థాలు, ఇతర సరంజామా సమకూర్చుకుని గుడారాలు వేసుకుని కూర్చోవడంతో గ్రహణ పరిధిలోని అమెరికా నగరాల్లో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. రెస్టారెంట్లు, బార్లు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాయి. విదేశాల నుంచి కూడా సందర్శకులు పెద్దసంఖ్యలో అమెరికాకు వచ్చారు. కండ్ల రక్షణకు ఉపకరించే ప్రత్యేక కళ్లద్దాల అమ్మకం జోరుగా సాగింది. పడమర పసిఫిక్ తీరంలో మొదలైన గ్రహణఛాయ ప్రయాణం నిరంతరంగా సాగుతూ తూర్పు తీరం వైపు సాగింది.

వాయవ్య రాష్ర్టమైన ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో మొట్టమొదటగా సంపూర్ణ గ్రహణం ఆవిష్కృతమైంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.05కు (భారత కాలమానం ప్రకారం రాత్రి 9.35కు) గ్రహణం మొదలైంది. సుమారు 75 నిమిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. మెల్లమెల్లగా గ్రహణఛాయ తూర్పు దిశగా కదులడం మొదలుపెట్టింది. ఇదాహో, వ్యోమింగ్, నెబ్రాస్కా, మిస్సోరీ, ఇల్లినాయిస్, కాన్సస్, కెంటకీ, టెన్నెస్సీ, నార్త్ కరోలినా, జార్జియా రాష్ర్టాల గుండా గ్రహణం ముందుకు సాగింది.

చివరకు సౌత్ కరోలినా రాష్ట్రంలో తీరం దాటింది. గ్రహణం తుదిఘట్టం చార్లెస్టన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.49కి(భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30) ముగిసింది. 14 రాష్ట్రాల్లోని 1.2 కోట్ల మంది అమెరికా జనాభా గ్రహణం పరిధిలోకి వచ్చారు. పెద్దఎత్తున సందర్శకుల రాకతో చిన్నచిన్న పల్లెలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. మరోవైపు నకిలీ కండ్లద్దాల బెడద అధికారులకు దడ పుట్టించింది.

Most Read