ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

పళనిస్వామి వర్గం నడవడి పై అనుమానాలున్నాయి : పన్నీరు వర్గం

Posted 8 months ago state politics

అన్నాడీఎంకే లోని ఇరు వర్గాల విలీనంపై జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చేలా కనబడటంలేదు. పన్నీరు వర్గం చేసిన డిమాండ్ పై అధికార పక్షం ఎటువంటి ప్రకటనలు చేయకపోవటంతో ఈ సందిగ్దత నెలకొన్నది. "శశికళను, దినకరన్ లను పార్టీ పదవులనుండి బహిష్కరిస్తున్నాం" అని పళని వర్గం ప్రకటనలు చేసిన, వాటిపై స్పష్టత ఇవ్వాలని పన్నీరు వర్గం డిమాండ్ చేస్తోంది.

పళనిస్వామి వర్గంతో విలీనానికి అనుసరించాల్సిన విధానం, జరుగుతున్న పరిణామాలు గురించి చర్చించేందుకు పన్నీరు తన మద్దతుదారులతో గురువారం నాడు తన నివాసంలో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి కె.పి మునుస్వామి విలేకరులతో మాట్లాడారు. " అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ అని పేర్కొంటూ" కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గం దాఖలు చేసిన అఫిడవిట్ వెనక్కు తీసుకోవాలని, వారి నుండి రాజీనామా లేఖలు పొందాలని డిమాండ్ చేశారు. తరువాత పార్టీ నిబంధనల ప్రకారం శశికళ కుటుంబాన్ని పార్టీ నుండి బహిష్కరిస్తున్నాం అని అధికార ప్రకటన చేయాలన్నారు.

అప్పటివరకు విలీనంకు సంబంధించిన చర్చలకు ఆస్కారం లేదన్నారు. పళనిస్వామి వర్గం తీరు చూస్తుంటే, ఇదంతా శశికళ కుటుంబం నడిపిస్తున్న డ్రామాల ఉందని కూడా అనుమానం వ్యక్తం చేశాడు. పన్నీరుకు ఎమ్మెల్యే మద్దతు లేకున్న కార్యకర్తల బలం ఉందని, సాధారణ ఎన్నికలు జరిగితే పన్నీరు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.ఇది ఇలా వుంటే అధికార పక్షం చర్చలకు ముందే ఇలా డిమాండ్ చేయటం తగదని, ముందు చర్చలకు రావాలని అంటోంది. చర్చల అనంతరం వారి డిమాండ్ లను పరిశీలిస్తామని తెలిపింది. ఈ పరిణామాలు చూస్తుంటే ఇది శశికళ ఆడుతున్న చదరంగంలా వుంది.

Most Read