మళ్ళీ తమిళనాడు రైతుల పోరుబాట

Posted 8 months ago | Category : national politics

మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో రైతుల ఆందోళన జరుగుతూ ఉండడంతో తమిళనాడు రైతులు మళ్ళీ పోరుబాట పట్టారు. రుణాలు రద్దు చేయాలని, కరువు సహాయ ప్యాకేజీలు ప్రకటించాలని, నదీ జలాల సమస్య పరిష్కారానికి కావేరి నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ చెన్నైలోని చపాక్‌ వద్ద  నిరవధిక ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమకిచ్చిన హామీలు నిలుపుకోవాలని, సుప్రీం కోర్టులో కేసును ఉపసంహరించుకోవాలని, 60 ఏళ్ళ వయస్సు పైబడిన రైతులకు పెన్షన్‌ ఇవ్వాలని దేశీయ తెన్నితియ నతిగల్‌ ఇయైపు వివాసయిగల్‌ సంగమ్‌ అధ్యక్షులు పి. అయ్యకన్ను ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

తాము ఇక్కడే ఉండి 32 రోజుల పాటు నిరసన బైఠాయింపులు కొనసాగిస్తామని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే తమ ఆందోళనను దేశ వ్యాప్తంగా విస్తరింప చేస్తామని  తెలిపారు. రైతుల డిమాండ్లు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమ య్యాయని పేర్కొ న్నారు. అన్ని కేటగిరీలకు చెందిన రైతులకు రుణాలు రద్దు చేయాలని ఆదేశిస్తూ మద్రాసు హై కోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం వెళ్ళడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. 

దేశానికి వెన్నెముకైన రైతులపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండించారు. త్వరలోనే జాతీయ స్థాయిలో ఆందోళనలు చేపడతామని, దీనికి సంబంధించి ఈ నెల 16న ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తామన్నారు. తమ సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తామని తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి హామీ మేరకు గతంలో ఢిల్లీలో చేపట్టిన ఆందోళనను ఉపసంహరించుకున్నామని ఆయన తెలిపారు. 

తమిళనాడు రైతులు ఢిల్లీలో ఇటీవల వినూత్న రీతులలో 40 రోజుల పాటుఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ నేషనల్‌ సౌత్‌ ఇండియన్‌ రివర్స్‌ ఇంటర్‌-లింకింగ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడుగా ఉన్న అయ్యకన్ను నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.


రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 13 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted 21 hours ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 2 days ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 3 days ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 3 days ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!