ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

కళ్లు తిరిగి పడిపోయిన మిశ్రా.

Posted 7 months ago national politics

తాను బట్టబయలు చేసే రహస్యాలతో ఢిల్లీ వణుకుద్దని శనివారం ప్రకటించిన మిశ్రా ఈరోజు మీడియా ముందుకు వచ్చారు.ఆప్ ముఖ్య అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు.అరవింద్‌ కేజ్రీవాల్‌ డొల్ల కంపెనీలు పెట్టి నల్లధనాన్ని వైట్‌గా మార్చారని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) బహిష్కృత నాయకుడు కపిల్‌ మిశ్రా ఆరోపించారు. ఎన్నిలక సంఘానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని తెలిపారు.ఆమ్‌ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిం​దని, ఢిల్లీ ప్రజలను మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మొహల్లా క్లినిక్‌ కుంభకోణంలోనూ ఆప్‌ నేతల పాత్ర ఉందన్నారు. ఆప్‌ నేతల విదేశీ పర్యటనల ఖర్చపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. షెల్‌ కంపెనీ నుంచి ఆప్‌ రూ. 2 కోట్ల విరాళం తీసుకుందని వెల్లడించారు. ఇవన్నీ కొంతమందికి తెలిసినా ఆధారాలు లేకపోవడంతో మౌనంగా ఉన్నారని చెప్పారు. తాను చేసిన ప్రతి ఆరోపణకు లిఖిత పూర్వక సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం​ చేశారు.

నాలుగు కంపెనీల్లో అక్రమాలకు సంబంధించి కేజ్రీవాల్‌కు ఆదాయపన్ను శాఖ నోటీసు పంపిందని తెలిపారు. ఆయనకు అక్రమంగా వందలాది కంపెనీలు ఉన్నాయని, ఈ కంపెనీల బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయలు ఉన్నాయని ఆరోపించారు. ఈ కంపెనీలకు సంబంధించిన అధికారిక పత్రాలు తన దగ్గర ఉన్నాయన్నారు. షెల్‌ కంపెనీలన్నీ కేజ్రీవాల్‌ నెలకొల్పినవేనని, యాక్సిస్‌ బ్యాంకు ద్వారా నల్లధనాన్ని వైట్‌గా మార్చారని తెలిపారు.

ఇలా కేజ్రీవాల్ ఫై సంచలన ఆరోపణలు చేస్తూ కపిల్ మిశ్రా విలేకరుల సమావేశంలో సొమ్మసిల్లి పడిపోయారు. ఆప్ నేతల విదేశీ పర్యటన వివరాలు వెల్లడించాలన్న డిమాండ్ తో గత ఐదు రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న కపిల్ మిశ్రా ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రి వద్ద కపిల్ మిశ్రా భార్య ప్రీతీ మిశ్రా విలేకరులతో మాట్లాడారు. కపిల్ మిశ్రా ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి వస్తే ఆప్ నేతల అవినీతి బాగోతానికి సంబంధించిన ఆధారాలను తాను సీబీఐకి అందిస్తానని అన్నారు.

Related Articles

Most Read