ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

అద్దంకి లో మళ్ళి డిష్యుం డిష్యుం

Posted a month ago politics

జిల్లాలో సంచలనం రేకెత్తించిన వేమవరం జంట హత్యల కేసులో అద్దంకి కోర్టుకు హాజరువుతున్న నిందితుల కారును, గ్రావెల్ తోలే టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో తొమ్మిది మందికి గాయాలయిన సంగతి తెలిసిందే.

అయితే ఈ రోడ్డు ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేమవరం హత్యకేసులో నిందితులమైన తమను హతమార్చేందుకే తమ కారును టిప్పర్‌తో ఢీకొట్టి ఉంటారని హత్య కేసు నిందితులు చెప్తున్నారు. ఇది పథకం ప్రకారం ప్రత్యర్థులు చేసిన పని అయి ఉంటుందని, పోలీసులు కూలంకషంగా విచారించాల్సిన అవసరం ఉందంటున్నారు. వారి మాటల పైనే కాక అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఇది ప్రత్యర్థి వర్గం పని అయి ఉంటుందని భావిస్తున్నారు.

బల్లికురవ మండలం వేమవరంలో కొద్ది నెలల క్రితం టీడీపీ సీనియర్‌ నేత కరణం బలరాం వర్గానికి చెందిన ఇద్దరిని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వర్గానికి చెందిన వారు హత్య చేశారు. ఈ జంట హత్యలకు సంబంధించి 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. నిందితులు గుంటూరు జైలులో ఉన్నారు. వీరిని గురువారం ఉదయం అద్దంకి కోర్టుకు హాజరు పరిచేందుకు తీసుకొస్తున్న సమయంలో అద్దంకి మండలం జార్లపాలెం వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది.

నిందితులు గుంటూరు నుంచి రాణింగవరం మీదుగా అద్దంకి వస్తుండగా, టిప్పర్ అద్దంకి నుంచి రాణింగవరం వైపు వెళ్తూ, ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు రోడ్డు పక్కన పొలాల్లోకి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న నిందితులు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఘటన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన నిందితులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుల కారును ఢీకొట్టిన టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను 11 రోజుల క్రితమే వేమవరం ఎస్సీ కాలనీకి చెందిన చెందిన కోటేశ్వరరావు, ఎల్లారావు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజే వారిద్దరితోపాటు, మరో ఇద్దరు కూడా పరారవడం అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. ఆ నలుగురు వ్యక్తులకు సంబంధించి ఫోన్‌లు కూడా స్విచ్ఛాఫ్‌ చేసి ఉన్నాయి. దీంతో తొలుత సాధారణ ప్రమాదంగా భావించిన పోలీసులు, ఇప్పుడు లోతైన విచారణ చేపట్టారు. అయితే ఈ హత్య వెనుక హత్య కావింప బడ్డ వర్గం హస్తం ఎంతవరకు ఉందనేది ఊహా జనితమే.

Related Articles

Most Read